బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ లో ప్రతి ఏడాది ఎంతోమంది యువ ఆటగాళ్లు బయటకు వస్తారు. అయితే అందులో కొంతమంది మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆ స్థాయికి చేరుకుంటారు. వారి కష్టాలు వింటే ఎవరికి అయిన భాధ కలగడం ఖాయం. ఇక అలంటి వారిలో ముంబై ఇండియన్స్ స్పిన్నర్ కుమార్ కార్తీకేయ కూడా ఉంటాడు. ఈ ఏడాది వేలంలో 20 లక్షలతో కార్తికేయను ముంబై జట్టు కొనుగోలు చేసింది.
Advertisement
అయితే ఈరోజు ఈ స్పిన్నర్ 9 ఏళ్ళ తర్వాత అమ్మను కలుసుకున్నాడు. చిన్నతనంలోనే ఇంట్లో ఆర్ధిక కష్టాలు చూసి.. వారికీ భారం కాకూడదు అని ఇంట్లో నుండి వచ్చేసాడు కార్తీకేయ. మధ్య ప్రదేశ్ నుండి ముంబై వచ్చి.. ఏదో ఒక్క పని చేసుకుంటూ.. డబ్బులు ఆదా చేయడానికి ఏడాదికిపైగా మధ్యాహ్నం అన్నం తినకుండా ఉన్నాడు. అలానే కష్టపడుతూ.. కొంచెం ఎదిగిన తర్వాత తన క్రికెట్ ప్రాక్టీస్ ప్రారంభించాడు.
Advertisement
ఆ తర్వాత తన సత్తాతో మధ్యప్రదేశ్ రంజీ జట్టులోకి వచ్చి సక్సెస్ అయ్యాడు. ఆ ప్రదర్శన తనను ఐపీఎల్ లోకి తీసుకువచ్చింది. ఇక ఇక్కడ కూడా ఆడిన నాలుగు మ్యాచ్ లలోనే తన సత్తా నిరూపించుకున్నాడు. ఇక ఐపీఎల్ లో సక్సెస్ అయిన తర్వాత ఈరోజు తిరిగి తన ఇంటికి వెళ్లిన కార్తికేయ ట్విట్టర్ లో ” 9 ఏళ్ళ మూడు నెలల తర్వాత అమ్మను కలిసాను. ఇప్పుడు నా భావాలను నేను చెప్పలేను” అంటూ తన తల్లితో దిగ్గిన ఫోటోను పోస్ట్ చేసాడు.
ఇవి కూడా చదవండి :