Home » బాబర్ ఆజాం రికార్డుకు ఎసరు పెట్టిన సూర్య..!

బాబర్ ఆజాం రికార్డుకు ఎసరు పెట్టిన సూర్య..!

by Azhar
Ad

ప్రస్తుతం పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు అనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్ లో కూడా బాబర్ తన డామినేషన్ కొనసాగిస్తున్నాడు. టెస్టులో మూడో స్థానంలో ఉన్న బాబర్.. వన్డే మరియు టీ20 లో అయితే మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంకా ఇందులో టీ20ల్లో బాబర్ మొదటి స్థానంలో 1000 రోజులకు పైగా ఉంటూ విరాట్ కోహ్లీ రికార్డును ఈ మధ్యే బ్రేక్ చేసాడు.

Advertisement

అయితే ఇప్పుడు ఆ రికార్డుకు భారత స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ ఎసరు పెట్టాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో మూడు స్థానాలను మెరుగు పరుచుకున్న సూర్య కుమార్ యాదవ్ ఏకంగా రెండో స్థానానికి వచ్చేసాడు. అందువల్ల మొదటి ప్లేస్ లో ఉన్న బాబర్ అలాగే రెండో ప్లేస్ లో ఉన్న సూర్య కుమార్ యాదవ్ కు మధ్య రెండు రేటింగ్స్ పాయింట్స్ మాత్రమే తేడా ఉంది.

Advertisement

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సమయంలో సూర్య కుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగగా.. ఇప్పుడు వెస్టిండీస్ పర్యటనలో కూడా నిన్న జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో 74 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాబట్టి ఈ టూర్ లో మిగిలి ఉన్న మిగిలిన రెండు టీ20 మ్యాచ్ లలో సూర్య ఒక్క హాఫ్ సెంచరీ చేసినా కూడా బాబర్ ను వెన్నకి నెట్టి సూర్య మొదటి స్థానంలోకి వస్తాడు. దాంతో 1000 రోజులకు పైగా ఆ స్థానంలో కొనసాగుతున్న బాబర్ యొక్క రికార్డుకు బ్రేక్ అనేది పడుతుంది.

ఇవి కూడా చదవండి :

మళ్ళీ పాకిస్థాన్ వెళ్తాను అంటున్న ఇంగ్లాండ్..!

ఒక్కే జెర్సీని వేసుకున్న భారత ఆటగాళ్లు..!

Visitors Are Also Reading