పరిచయం :
MUKHACHITRAM MOVIE REVIEW IN TELUGU: కలర్ ఫోటో సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు సందీప్ రాజ్. మొదటి సినిమాతోనే సందీప్ రాజ్ జాతీయ అవార్డును అందుకున్నారు. ఇక సందీప్ రాజ్ కథతో తెరకెక్కిన సినిమా ముఖచిత్రం. ఈ సినిమాపై ముందు నుంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో వికాస్ వశిష్ట.. ప్రియా వడ్లమాని ముఖ్యమైన పాత్రలలో నటించారు. విశ్వక్ సేన్ సినిమాలో గెస్ట్ రోల్ చేయడంతో సినిమాకు మరింత హైప్ వచ్చింది. ఇక ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆకట్టుకుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం..
Advertisement
MUKHACHITRAM MOVIE STORY IN TELUGU సినిమా కథ :
హీరో వికాస్ వశిష్ట ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రాజకుమార్ పాత్రలో నటించగా ప్రియా వడ్లమాని మహతిని వివాహం చేసుకుంటాడు. పెళ్లి తర్వాత కొన్ని నెలలకే తన భార్య చనిపోతుంది. ఆ తర్వాత మహతిని మర్చిపోలేక రాజ్ కుమార్ తన స్నేహితురాలు అయిన మాయాకు తన భార్యలా ప్లాస్టిక్ సర్జరీ చేస్తాడు. అయితే అసలు మాయ ఎవరు…? డాక్టర్ రాజ్ కుమార్ మాయకే తన భార్యలా ఎందుకు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. అన్నదే ఈ సినిమా కథ.
Advertisement
MUKHACHITRAM MOVIE REVIEW IN TELUGU విశ్లేషణ :
ఈ సినిమాను హాలీవుడ్ సినిమా ఫేస్ ఆఫ్ మరియు టాలీవుడ్ లో వచ్చిన ఎవడు లాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. ప్లాస్టిక్ సర్జరీతో ముఖః మార్చేయడం అనేది ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికీ దర్శకుడు ప్రేక్షకులను కథలో లీనం చేయలేకపోయాడు. సినిమాలో కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నా మొత్తంగా చూసుకుంటే మాత్రం సినిమా ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుంది. లీడ్ పాత్రలో నటించిన వికాస్ వశిష్ట.. ప్రియా వడ్లమాని తమ నటనతో మెప్పించారు. కొత్త వాళ్ళు అయినప్పటికీ డైలాగ్ డెలివరీ మరియు ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇచ్చారు. అంతేకాకుండా వికాస్ వశిష్ట తన పాత్రలో విభిన్న హావ భావాలను పలికించాడు. అయితే హీరో హీరోయిన్ లు తమ పాత్రల్లో లీనమైనప్పటికీ దర్శకుడు సరిగా వాడుకోలేకపోయాడు. విశ్వక్ సేన్ అతిధి పాత్రలో న్యాయవాదిగా కనిపించాడు. తన పాత్రతో ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. పాటలు కూడా బాగానే ఉన్నాయి. అయితే ప్రొడక్షన్ వాల్యూస్ ను మెచ్చుకోవచ్చు కానీ ఎడిటింగ్ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉన్నప్పటికీ సన్నివేశాలు సరిగ్గా కుదరకపోవడం కొంతమేర సాగదీతగా అనిపించడం వల్ల ప్రేక్షకులకి బోర్ కొట్టిన ఫీలింగ్ వస్తుంది.
also read : మిరపకాయ్ సినిమాను చేతులారా వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?