భారత క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోని ఓ చెరగని ముద్ర వేసాడు అనే విషయం అందరికి తెలిసిందే. టీం ఇండియా కెప్టెన్ గా మూడు ఐసీసీ టైటిల్స్ అందుకొని ప్రపంచ క్రికెట్ లో ఏ కెప్టెన్ కు సాధ్యం కానీ రికార్డును నెలకొల్పాడు. ఇన్ ఐపీఎల్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఆ జట్టుకు నాలుగు టైటిల్స్ అందించాడు. అటువంటి ధోని తాను ఈ ఈరోజు ఇలా ఉండటానికి వారే కారణం.. ఆ జట్టే కారణం అని చెబుతున్నాడు. తాజాగా ధోని తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ యొక్క సిల్వర్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చాడు.
Advertisement
ఈ కార్యక్రమంలో ధోని మాట్లాడుతూ. నేను ఇప్పటివరకు ఏ జిల్లా కార్యక్రమానికి వెళ్ళలేదు. ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా నేను మా రాంచీ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కు ధన్యవాదాలు చెప్పాలి అని అనుకుంటున్నాను. ఏ ఆటగాడి అయిన సరే తన జిల్లా కోసం ఆడటం ఎంతో గర్వించదగిన విషయం. ఎందుకంటే నేను అక్కడ ఆడకపోతే ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. నేను నా స్కూల్ అలాగే జిల్లా జట్టుకు ఆడటం వల్లనే నాకు దేశానికి ఆడే ఆవకాశం వచ్చింది అని తెలిపాడు.
Advertisement
అయితే ధోనికి తన రాంచీతో ఎంత అనుబంధం ఉందొ తమిళనాడుతో కూడా అంతే ఉంది. 2020 లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చిన ధోని చెన్నై అభిమానుల ముందే ఐపీఎల్ కు వీడ్కోలు పలకాలి అని అనుకున్నాడు. కానీ కరోనా కారణంగా గత మూడు సీజన్లు కూడా చెన్నైలో జరగలేదు. ఈ ఏడాది ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు మొత్తం ముంబైలోనే జరగగా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దారుణంగా విఫలమైంది. వరుస పర్యజల్ కారణంగా పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది.
ఇవి కూడా చదవండి :