క్రికెట్లో భారత్‌కు ఒక ప్రపంచ కప్, ఒక ట్వీ-20 కప్‌ను అందించిన కెప్టెన్. అతను హెలికాప్టర్ షాట్ పెహచాన్..! వ్యక్తిత్వంలో మిస్టర్ కూల్, మ్యాచ్‌ను ముగించడంలో ధనాదన్, కెప్టెన్లో మిస్టర్ చాణక్య ఇలా అభిమానులకు తలైవా.. అతడే జార్ఖండ్ డైనమైట్ మహేంద్రసింగ్ ధోని. తన కెరీర్లో సాధించిన రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ఇప్పటివరకు ధోని తన కెరీర్లో అన్ని ఫార్మాట్లలో కలుపుకొని 332 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 332 మ్యాచ్‌లలో 178 సార్లు భారత్ గెలిచింది. ధోని తరువాత కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ ఇప్పటివరకు 157 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్‌కు నాయకత్వం వహించాడు.
Advertisement
ధోని ఇప్పటివరకు మొత్తం మూడు ఫార్మాట్లలో కలుపుకొని 538 మ్యాచ్‌లలో 195 సార్లు వికెట్లను గిరాటేసి బ్యాట్స్‌మెన్‌ను ఫెవిలియన్‌కు పంపించాడు. ఇతని తరువాత రెండవస్థానంలో బంగ్లాదేశ్ కెప్టెన్ ముప్సీకర్ రహీం ఉన్నాడు. ఇప్పటివరకు ధోని 87 స్టంపౌట్స్ చేసాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 142 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. 2004 డిసెంబర్లో వన్డే క్రికెట్లోకి అడుగుపెట్టి.. కేవలం 15 నెలల కాలంలోనే ఐసీసీ వన్డే ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ ర్యాంకు కైవసం చేసుకున్నాడు.
ధోని ప్రపంచంలోనే బెస్ట్ ఫినిషర్ అని చెప్పడానికి నిదర్శనం ఈ రికార్డు. ధోని ఇప్పటివరకు మూడు ఫార్మాట్లను కలుపుకొని 13 సార్లు టీమిండియా సిక్సర్ తో గెలిపించాడు. 2018 వెస్టిండిస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో రవీంద్ర జడేజా బౌలింగ్ చేస్తున్నప్పుడు కీమోపాల్ అనే బ్యాట్స్‌మ్యాన్‌ను ధోని కేవలం 0.08 సెకండ్ లో స్టంప్ ఔట్ చేసి షాక్ ఇచ్చాడు. క్రికెట్ చరిత్రలో ఇదే క్వికెస్థ్ స్టంపౌట్..! 2007 సంవత్సరంలో మొట్టమొదటి టీ-20 వరల్డ్ కప్‌ను 2011లో వన్డే వరల్డ్ కప్, 2013 ఐసీసీ ఛాంపియన్ ట్రోపిని తన నాయకత్వంలో సాధించాడు.