Home » నాన్న చేతిలో బాగా తిట్లు తిన్న ధోని.. ఏ విషయంలో అంటే..!

నాన్న చేతిలో బాగా తిట్లు తిన్న ధోని.. ఏ విషయంలో అంటే..!

by Azhar
Ad
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరు తెలియని వారు ఎవరు ఉండరు. భారత జట్టును నడిపిన మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా.. మూడు ఐసీసీ టైటిల్స్ అందుకున్న ఏకైక కెప్టెన్ గా ధోని రికార్డులు నెలకొల్పాడు. అలాగే తానా ఆట తీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ధోని.. చిన్నపుడు తన తండ్రి వద్ద ఎప్పుడు తిట్లు తినేవాడు.
ఈ విషయాన్ని స్వయంగా ధోనినే వెల్లడించాడు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ కు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన ధోని మాట్లాడుతూ.. నేను స్కూల్ లో 7వ తరగతి నుండే క్రికెట్ ఆడటం ప్రారంభించాను. ఎప్పుడు బ్యాట్ పట్టానో.. అప్పటి నుండి అటెండెన్స్ అలాగే మార్కులు కూడా తగ్గాయి. 10వ తరగతి వరకు ఇదే కొనసాగింది. అప్పుడే మా నాన్న.. నువ్వు 10వ తరగతి కూడా పాస్ కావు అని తెట్టెవాడు.
అయితే బోర్డు ఎక్సామ్స్ అయిపోయిన తర్వాత కూడా.. ఆ ఇక నువ్వు మళ్ళీ పరీక్షలు రాయాల్సిందే అనేవారు. కానీ నాకు 10thలో 66 శాతం మార్కులు వచ్చాయి. అవి చూసి ఆయన మొదట ఆశ్చర్యపోయారు. అలాగే ఇంటర్ లో 56 శాతం వచ్చాయి. దాంతో మా నాన్న ఫుల్ హ్యాపీ అని ధోని తెలిపాడు. ఇక తనకు తన స్కూల్ డేస్ అనేవి ఎప్పటికి గుర్తుకు వస్తాయి అని ధోని చెప్పారు.

Advertisement

Visitors Are Also Reading