సీతారామం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తెలుగు అభిమానులను సొంతం చేసుకుని మృణాల్ ఠాకూర్ ఓవర్ నైట్ లోనే స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది. మృణాల్ తాను నటించిన మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది. ఈ అమ్మడు నటనకి యూత్ అంతా కనెక్ట్ అయిపోయారు. ఈ భామ తెలుగులోనే కాకుండా హిందీ, మరాఠీలో కూడా సినిమాలు చేస్తుంది. తాను తెలుగులో చేసింది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ అభిమానులు ఈ అమ్మడు జపం చేస్తున్నారు.
Advertisement
ఇక ఈ అమ్మడు తాజాగా నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’ సినిమాతో నాని సరసన జత కట్టింది. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఇక సంక్రాంతికి విజయ్ దేవరకొండతో కలిసి నటించిన చిత్రం విడుదల కాబోతోంది. ఈ అమ్మడు చిరంజీవి సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిందని సమాచారం అందుతోంది. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఇక కెరీర్లో దూసుకుపోతున్న ఈ అమ్మడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ… మృణాల్ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది.
Advertisement
తన కుటుంబసభ్యులు పెళ్లి విషయంలో చాలా ఒత్తిడి చేస్తున్నారని, కానీ తనకు ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదని, ప్రస్తుతం నా ఆలోచన అంతా సినిమాల పైనే ఉందని చెప్పుకొచ్చింది. ఎవరితో అయినా ప్రేమలో ఉన్నారా అని అడగ్గా…. హాలీవుడ్ హీరో కీనూ రీవ్స్ అంటే తనకు చాలా ఇష్టమని, అలాంటి వ్యక్తి జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటున్నాను అని చెప్పింది. నా చిన్నతనంలోనే అతన్ని చూసి ప్రేమలో పడ్డాను అని చెప్పుకొచ్చింది. తనది కేవలం వన్ సైడ్ లవ్ మాత్రమేనని అలాంటి వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి
- IND Vs PAK మ్యాచ్.. ఐఫోన్ పోగొట్టుకున్న ప్రముఖ నటి
- RX 100 సినిమా లాగే.. దర్శకున్ని ప్రేమించి మోసం చేసిన పాయల్..?
- పవన్ లో ఏదో లోపం ఉంది..అందుకే 3 పెళ్లిళ్లు ? : సజ్జల రామకృష్ణారెడ్డి