తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజ్యసభ సభ్యుడు బీసీ నేత ఆర్ కృష్ణయ్య ని కలిశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. ఆయన బీసీల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని సీఎంని కోరారు. మంత్రివర్గ విస్తరణలో ఉపముఖ్యమంత్రి పదవితో పాటుగా ఐదు మంత్రి పదవులు బీసీ లకు ఇవ్వాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. అధికారం లోకి రాక ముందు కాంగ్రెస్ పార్టీ బీసీలకు అనేక వాగ్దానాలు ఇచ్చిందని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ వాగ్దానాలు కచ్చితంగా అమలు చేస్తారన్న భావన కలిగిందని ఆర్ కృష్ణయ్య రేవంత్ రెడ్డితో చెప్పారు.
Advertisement
Advertisement
గత మంత్రి వర్గ నిర్మాణం లో బీసీల ప్రాతినిథ్యం తక్కువ ఉండేదని చెప్పారు వచ్చే విస్తరణలో బీసీలకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు ఆర్ కృష్ణయ్య చెప్పారు. త్వరలో భర్తీ చేయబోయే కార్పొరేషన్లు ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లు, దేవాలయ కమిటీలో ఇతర నామినేటెడ్ పోస్టుల తో బీసీలకు జనాభా ధమాషా ప్రకారం 50 శాతం పదవులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు కృష్ణయ్య.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!