సాధారణంగా పెన్ను పోయిందంటే పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరు. కానీ పెన్ను పోయిందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ పోలీసులను ఆశ్రయించడం కాస్త ఆశ్చర్యమే కలిగింది. అసలు ఏమి జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ఎంపీ విజయ్ వసంత్ పెన్ను పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెన్ను పోతే ఫిర్యాదా..? ఒక ఎంపీ అయుండి అని అనుకుంటున్నారా..? ఆ పెన్ను విలువ తెలిస్తే షాక్ అవుతారు. అందుకే ఆ ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ పెన్ను విలువ అక్షరాల లక్ష యాబై వేల రూపాయల విలువైన మౌంట్ బ్లాంక్ ఫౌంటెన్ పెన్ను. ఎంపీ వసంత్ తన తండ్రి మరణించిన తరువాత రెండేళ్లుగా ఆయన జ్ఞాపకార్థంగా వాడుతున్నారట. దాని ఖరీదు కంటే కూడా విలువైందన్న మాట.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఇటీవల చెన్నై వచ్చారు. జూన్ 30 గిండిలోని స్టార్ హోటల్లో జరిగిన సమావేశానికి ఎంపీ విజయ్ వసంత్ హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన జేబులో ఆ పెన్ను ఉంది. ఆ తరువాత కనిపించకుండా మాయమైపోయింది. యశ్వంత్ సిన్హా కార్యక్రమానికి కేవలం కాంగ్రెస్, డీఎంకే సభ్యులు మాత్రమే హాజరయ్యారు. బయటి వ్యక్తులు ఎవ్వరూ రాలేదని ఎంపీవసంత్‌కుమార్ వెల్లడించారు. తన పెన్నులను దొంగిలించారని ఆయన చెప్పడం లేదు. రద్దీ ఎక్కువగా ఉండడంతో పెన్ను జేబులోంచి కూడా జారీ కింద పడిపోవచ్చని పేర్కొన్నారు.
Advertisement
హోటల్ యజమాన్యాన్ని సీసీటీవీ రాకార్డులు చెక్ చేయాల్సిందిగా ఎంపీ వసత్ కోరారు. నిబంధనల ప్రకారం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాతనే పుటేజీ చెక్ చేస్తామని వాళ్లు చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేశానని ఎంపీ వివరణ ఇచ్చారు. ఎంపీవసంత్ కుమార్ పెన్నును ఎవ్వరో దొంగిలించారని.. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారని మీడియాలో పెద్ద సంఖ్యలో వార్తలు వినిపించాయి. కేవలం పెన్ను పోయిందని మాత్రమే ఫిర్యాదు చేశాను. దొంగిలించారని మాత్రం చెప్పలేదు. త్వరలోనే పోలీసులు ఆ పెన్నును రీకవరీ చేస్తారని ఆశిస్తున్నానని ఎంపీ వసంత్‌కుమార్ పేర్కొన్నారు. ఎంపీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని గిండీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read :
ఐఎంఎఫ్ గీతా గోపినాథ్ నూతన రికార్డు.. సోషల్ మీడియాలో వైరల్..!
ఆ 4 యాప్స్ వెంటనే డిలీట్ చేయండి.. మళ్లీ ఆ మాల్‌వేర్ వచ్చేసింది..!