Home » వీక్ క్లైమాక్స్ వల్ల బాక్స్ ఆఫీస్ బోల్తా పడిన సినిమాలు ఇవే…!

వీక్ క్లైమాక్స్ వల్ల బాక్స్ ఆఫీస్ బోల్తా పడిన సినిమాలు ఇవే…!

by AJAY
Published: Last Updated on
Ad

సినిమాలో క్లైమాక్స్ కు ఉండే ప్రాధాన్య‌త గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. క్లైమాక్స్ బ‌లంగా ఉంటేనే సినిమాకు పాజిటివ్ టాక్ వ‌స్తుంది. సినిమా మొత్తం స‌రిగ్గా తీసినా ప్రేక్ష‌కుడు బ‌య‌ట‌కు వెళ్లే స‌మ‌యంలో మాత్రం స‌రైన క్లైమాక్స్ లేకుంటే దాన్నే గుర్తు పెట్టుకుంటాడు.

Advertisement

కాబ‌ట్టి సినిమాలో ఇంట‌ర్ వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ లను ద‌ర్శ‌కులు వీలైనంత కొత్త‌గా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక టాలీవుడ్ లో కొన్ని సినిమాలు భాగున్న‌ప్ప‌టికీ వీక్ క్లైమాక్స్ ల కార‌ణంగా బోల్తాపడ్డాయి. అలా వీక్ క్లైమాక్స్ కార‌ణంగా బోల్తా ప‌డిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం…

విక్టరీ వెంక‌టేష్ హీరోగా న‌టించిన శ్రీను సినిమా ప్రారంభం నుండి ఎంతో వినోద‌భ‌రితంగా ఉంటుంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ వీక్ గా ఉండ‌టం వ‌ల్ల బోల్తాప‌డింది.

Advertisement

క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన వేదం సినిమా చాలా మంది ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంది. అయితే సినిమా చివ‌రలో ఇద్దరు హీరోలు క‌న్నుమూయ‌డం వ‌ల్ల ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ హిట్ కాలేక‌పోయింది.

ప్ర‌భాస్ హీరోగా న‌టించిన చ‌క్రం సినిమాకు కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో సెంటిమెంట్ ఓవ‌ర్ డోస్ అవ్వ‌డం…క్లైమాక్స్ వీక్ గా ఉండ‌టంతో బాక్స్ ఆఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది.

నాని హీరోగా న‌టించిన భీమిలి క‌బ‌డ్డీ జ‌ట్టు సినిమా ఫ‌స్ట్ ఆఫ్ మొత్తం ఎంతో ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. కానీ చివ‌ర‌లో నాని చ‌నిపోవ‌డం వ‌ల్లే ఈ సినిమా కూడా అనుకున్న మేర విజ‌యం సాధించలేక‌పోయింది.

ప్ర‌భుదేవా కాజోల్ అరంద స్వామి కాంబినేష‌న్లో వ‌చ్చిన ఫ‌స్ట్ ఆఫ్ కు భారీ క్రేజ్ వ‌చ్చినప్ప‌టికీ క్లైమాక్స్ వీక్ గా ఉండ‌టం వ‌ల్ల ఫ్లాప్ అయ్యింది.

Visitors Are Also Reading