Home » ఈ వారం థియేటర్ల లోకి రాబోతోన్న సినిమాలు ఇవే..!

ఈ వారం థియేటర్ల లోకి రాబోతోన్న సినిమాలు ఇవే..!

by Sravya
Ad

ప్రతివారం కూడా కొత్త సినిమాలు థియేటర్లలోకి వస్తూ ఉంటాయి అయితే సినిమా వచ్చి కొన్ని రోజులు ఆడే వరకు సినిమా రిజల్ట్ చెప్పలేము. ఈమధ్య కాలంలో చిన్న సినిమాలు కూడా భారీ వసూళ్లను రాబడుతున్నాయి కొన్ని కోట్ల పెట్టి తీసిన సినిమాలు కూడా డిజాస్టర్లు అవుతున్నాయి. సో ఏ సినిమా ఎలా వసూళ్లని రాబడుతుందనేది ఎవరు ఊహించలేము. అయితే ఈసారి కూడా ఎప్పటిలానే పలు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. వైవా హర్ష అభినవ గోమటం వంటి కమెడియన్లు హీరోలుగా వస్తున్నారు. బాల నటుడిగా అతడు, భద్ర, ఆర్య వంటి సినిమాల్లో నటించిన దీపక్ ఇప్పుడు హీరోగా మారాడు. సిద్ధార్థ రాయి సినిమాతో దీపక్ వస్తున్నాడు.

Advertisement

అయితే ఇక ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలకి సంబంధించిన పూర్తి వివరాలను చూద్దాం.. వైవా హర్ష కమీడియన్ గా అందరికీ తెలుసు యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ వైవా హర్ష పాపులర్ అయ్యాడు కొంతకాలానికి మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు సుందరం మాస్టర్ సినిమాతో వైవా హర్ష ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు ఈ సినిమా టీజర్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి. అలానే కామెడీయంగా అభినవ్ గోమటం ఫేమస్ అయ్యాడు. ఈ నగరానికి అనే సినిమాతో కమెడియన్ గా ఫేమస్ అయిపోయాడు.

Advertisement

అభినవ్ చెప్పిన డైలాగ్ లు మోడ్యులేషన్ ఇప్పటికీ ట్రోల్స్ లో మనకి కనబడుతుంటాయి మస్తు షేడ్స్ ఉన్నాయి రా అని టైటిల్ గా పెట్టేసి సినిమా ని తీశారు ఈ వారం ఈ ఇద్దరు కమెడియన్ల సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి. అతడు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన దీపక్ సిద్ధార్థ రాయి సినిమాతో రాబోతున్నాడు ఈ సినిమా టీజర్ ట్రైలర్ చూస్తుంటే ఇది కొంచెం అర్జున్ రెడ్డి స్టైల్ లో వుంది. ఈ మూవీ దీపక్ కి ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది చూడాలి. ఫిబ్రవరి 23న ఈ మూడు సినిమాలో కూడా రిలీజ్ అవ్వబోతున్నాయి మరి ఈ ముగ్గురికి ఈ సినిమాలు ఎలా కలిసి వస్తాయి అనేది చూడాల్సి ఉంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading