కరోనా మహమ్మారికి ముందు అసలు ఓటీటీ అంటే చాలా మందికి తెలియదు. కరోనా కారణంగా చాలా సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. కరోనా తరువాత కూడా థియేటర్లలో విడుదలైన సినిమాలు ఓటీటీలో కూడా విడుదలై మంచి రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. డిసెంబర్ 09న ఒకే రోజు చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. వాటిలో సమంత నటించిన యశోద, నితిన్ మాచర్ల నియోజకవర్గం, అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో, కాంతారా, లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్, బ్లాక్ ఆడమ్ వంటి చిత్రాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి.
Advertisement
యశోద
సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద చిత్రం థియేటర్లలో మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. మొదటి వారంలో కలెక్షన్లు బాగానే వచ్చినప్పటికీ రాను రాను కలెక్షన్లు తగ్గిపోయాయి. మరోవైపు ఈ సినిమా ఓటీటీ విడుదలపై కోర్టులో వివాదం కూడా తలెత్తింది. ఎట్టకేలకు డిసెంబర్ 09న యశోద ఓటీటీలో విడుదలయ్యేందుకు లైన్ క్లియర్ అయింది.
మాచర్ల నియోజకవర్గం
యంగ్ హీరో నితిన్ – కృతిశెట్టి జంటగా నటించిన సినిమా మాచర్ల నియోజకవర్గం. ఈ చిత్రం ఆశించిన మేరకు థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా డిసెంబర్ 09 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
కాంతారా
కాంతారా సినిమా ఇప్పటికే పలు భాషలలో ఓటీటీలో విడుదల అయింది. థియేటర్లలో కేజీఎఫ్ సినిమా రికార్డులనే క్రాస్ చేసిన కాంతారా ఎంతటి సంచలనం నమోదు చేసిందో చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే ఈ చిత్రం హిందీ వెర్షన్ డిసెంబర్ 09 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
Advertisement
ఊర్వశివో రాక్షసివో
అల్లు శిరీష్-అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించిన చిత్రం ఊర్వశివో రాక్షసివో. ఈ సినిమా థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది. కానీ కలెక్షన్ల పరంగా మాత్రం కాస్త నిరాశ పరిచిందనే చెప్పాలి. ఊర్వశివో రాక్షసివో చిత్రం డిసెంబర్ 09 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read : రాజీవ్ కనకాల తండ్రిని ఇండస్ట్రీలో తొక్కేసింది ఎవరో తెలుసా..?
లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్
సంతోష్ శోభన్ హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన చిత్రం లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 09 నుంచి ఈ సినిమా సోనిలీవ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read : సుస్మితాసేన్ కోసం గూగుల్ లో తెగ సెర్చ్ చేశారట.. ఎందుకో తెలుసా ?
బ్లాక్ ఆడమ్
డీసీ ఎక్స్ టెండెడ్ యూనివర్స్ లో విడుదలైన తాజా చిత్రం బ్లాక్ ఆడమ్. ఇందులో డ్వేన్ జాన్సన్, సారా షాహి, పియర్స్ బ్రాస్నన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దాదాపు 200 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందించారు. 200 మిలియన్ డాలర్లు భారత కరెన్సీ ప్రకారం.. 1,620 కోట్లకుపైగా అన్నమాట. జావుమే కొల్లేట్ -సెర్రా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న బ్లాక్ ఆడమ్ చిత్రం భారత్ లో మాత్రం యావరేజ్ గానే ఆడింది. ఇక ఓటీటీలో ఎలా ఉంటుందో చూడాలి. డిసెంబర్ 10 నుంచి ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.
Also Read : ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోన్న మసూద.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..?