ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మెగా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు చిరంజీవి. తెలుగు కమర్షియల్ సినిమా గురించి చెప్పాలంటే మొదటి వినపడేది చిరంజీవి పేరే. 150 కి పైగా సినిమాల్లో నటించి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు చిరు. స్టైల్ తో డాన్స్ తో అందరిని ఆకట్టుకున్నారు చిరంజీవి. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీకి చాలామంది వచ్చారు. హీరోలు అవ్వాలని చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీకి ఇప్పుడు చాలా మంది వస్తూనే వున్నారు.
Advertisement
చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చి గుర్తింపుని పొందడమే కాకుండా ఆయన కుటుంబం నుండి చాలామంది హీరోలుగా ఇప్పుడు వచ్చారు. చిరంజీవి లాగే మంచి పేరు తెచ్చుకోవడానికి కృషి చేస్తున్నారు. అయితే హీరో అన్నాక నటన, డాన్స్ ఇవన్నీ సాధారణమే. చిరు మాత్రం ఆల్రౌండర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు, అన్ని విభాగాల్లో రాణించాలని చిరంజీవి ఎంతో కృషి చేశారు.
Advertisement
చాలామందికి తెలియని విషయం ఏమిటంటే చిరంజీవి దర్శకత్వం కూడా వహించారు అనధికారికంగా దర్శకుడిగా చిరంజీవి వ్యవహరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ రోజుల్లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా ఇంద్ర నిలిచింది. డైరెక్టర్ బి గోపాల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అయితే అప్పుడు ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అల్లరి రాముడు సినిమాకి కూడా గోపాల్ దర్శకత్వం వహిస్తున్నారు.
రెండు సినిమాలని కూడా ఒకేసారి షూటింగ్ చేస్తున్నారు గోపాల్. ఎక్కువగా అల్లరి రాముడు సినిమా మీద ఫోకస్ పెట్టడంతో చిరంజీవి దర్శకుడు బాధ్యతలు తీసుకున్నారు. అప్పట్లో ఈ విషయం మారుమ్రోగి పోయింది. ఇంద్ర సినిమా అప్పుడు హిట్ అయితే అల్లరి రాముడు సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. అయితే చిరంజీవి తన ప్రతి సినిమాకి కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పూర్తి ఇన్వాల్వ్ అయ్యేవారు. ఇప్పుడు రీసెంట్ గా వస్తున్న భోళా శంకర్ సినిమాకి కూడా దర్శకత్వం వహించారని తెలుస్తోంది. అనధికారికంగా మూవీ ని డైరెక్ట్ చేస్తూ ఉంటారు చిరంజీవి.
Also read:
చిరు “భోళా శంకర్” మూవీ ని ఆ “ఎన్టీఆర్” సినిమాల నుంచి కాపీ కొట్టారా? టీజర్ లో ఇవి గమనించారా?
మైదా తో కలిగే నష్టాలు చూసారంటే.. అస్సలు ముట్టుకోరు..!