ప్రతి తల్లి కూడా బిడ్డ క్షేమం కోసం వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం చూస్తూ ఉంటుంది తెలిసి తెలియక తల్లులు చేసే కొన్ని పనులు కారణంగా బిడ్డల భవిష్యత్తు మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. మరి తల్లి చేసే ఆ పనులు కారణంగా బిడ్డ భవిష్యత్తులో ప్రభావం పడేవి ఏంటనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కంటే గొప్పది ఇంకోటి ఏమీ లేదు. తల్లి కోసం ఎన్నో చేస్తుంది. ఆకలితో ఉన్నా కూడా బిడ్డ ఆకలి తీర్చడానికి చూస్తుంది నిద్రపోకుండా తన బిడ్డ మాత్రం ప్రశాంతంగా నిద్ర పోవాలని చూస్తుంది.
Advertisement
తమ బిడ్డల విషయంలో తల్లి తప్పు చేయడం ఏంటి అని అనుకుంటున్నారా తాను డైరెక్ట్గా ఈ తప్పులు చేయకపోయినా కొన్ని మాటలు చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. తల్లులు పిల్లలతో స్ట్రిక్ట్ గా ఉండాలి తప్పులేదు కానీ కఠినంగా మాత్రం ఉండకూడదు పిల్లలకు ప్రతి విషయంలో రూల్స్ పెట్టేసి దానికి తగ్గట్టుగా ఉండాలని చెప్పకూడదు తల్లుల పిల్లలతో సున్నితంగా ఉండాలి. ఎక్కువ కఠినంగా ఉంటే పిల్లలతో మీ బంధం సరిగ్గా ఉండదు అని గమనించాలి.
Advertisement
Also read:
చాలామంది పిల్లలు మాట వినట్లేదని పిల్లల్ని తిడుతూ ఉంటారు. అలా ఎక్కువ తిట్టడం అరవడం వంటివి చేయకూడదు వాటిని భరించలేక పిల్లలు దూరం అయిపోతూ ఉంటారు పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి. పిల్లలు ఏదైనా చేయగానే వెంటనే నాన్నకి చెప్తాను అని భయపెడుతుంటారు ఇలా చేయడం వలన పిల్లల దృష్టిలో తల్లి గౌరవం ఆటోమేటిగ్గా తగ్గిపోతుంది. తల్లి ఒంటరిగా ఎలాంటి పరిస్థితిని కూడా హ్యాండిల్ చేయలేదని భావిస్తారు. సో ఈ తప్పు కూడా జరగకుండా తల్లులు చూసుకోవాలి చాలామంది తల్లులు పిల్లలు మాట వినకుండా వాళ్ళతో బహిరంగంగా మాట్లాడకుండా సూచనలు మాత్రమే ఇస్తూ ఉంటారు పిల్లలతో ఓపెన్ కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!