ప్రపంచంలో కొన్ని సాంప్రదాయాలు, ఆచారాలు చూస్తే మనకు వింతగా అనిపిస్తుంది. మనుషులు ఇలా కూడా ఉంటారా అని అనిపిస్తుంది. కానీ కొందరు వారి సాంప్రదాయాలను, ఆచారాలను పాటిస్తూ వారి సంస్కృతిని కాపాడుకుంటూ ఉంటారు. పెళ్లి నలుగురు మధ్య జరుగుతుంది. కానీ మొదటి రాత్రి మాత్రం నాలుగు గోడల మధ్య జరగాలి. మూడో కంటికి కనిపించకుండా ఉండాలి. కానీ ఆ తెగలో అలా ఉండదు.
Advertisement
పెళ్లికూతురు, పెళ్లి కొడుకుతో పాటు పెళ్లికూతురు తల్లి కూడా అదే గదిలో నిద్రించాలట. ఇంకా వీరి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఏంటంటే… ప్రపంచంలోని పురాతన ఆచారాలకు ఆఫ్రికా ఖండం నిలయం. ఈ తెగలో ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత సాంస్కృతిని కాపాడుకుంటూ ఒకే విధమైన పునాదులు వేసుకుంటూ వస్తున్నారు. ఆఫ్రికాలోని ఓ గిరిజన ప్రాంతాల్లో ఒక వింత సాంప్రదాయం ఉంది. ఇక్కడ పెళ్లి జరిగిన తర్వాత వధూవరులతో పాటు పెళ్లికూతురు తల్లి కూడా వారి గదిలో నిద్రిస్తుందట.
Advertisement
పెళ్లి జరిగిన తర్వాత మొదటి రాత్రిన పెళ్లికూతురు తల్లి తప్పకుండా ఉండాలట. పెళ్లికూతురు తల్లి లేకపోతే ఆ స్థానంలో ఎవరో ఒకరు కచ్చితంగా ఉండాలట. వైవాహిక జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని వాళ్లకు వివరిస్తుందట. కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించాలి? ఎలా ఉండాలి అనే విషయాలను పెళ్లికూతురు తల్లి వారిద్దరికి చక్కగా చెబుతుందట. పూర్వకాలంలో ఈ తెగలలో ఒక వృద్ధ మహిళ ఈ ఆచారాన్ని పెట్టిందట. ప్రస్తుత కాలంలో భార్య భర్తల మధ్య అన్యోన్యత తగ్గి గొడవలు పెరుగుతుండటం వల్ల ఆమె ఈ ఆచారాన్ని పెట్టిందట. వధూవరులతో పాటు ఆమె తల్లి కూడా వెళ్లి వారికి అన్ని విషయాలను వివరించి చెబుతుందట.