దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దాదాపు పది లక్షల ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ జరుగుతుందని రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. పలు మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో 9.79 లక్షల ఉద్యోగాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 78 మంత్రిత్వ శాఖలు, ఇతర విభాగాలు, రక్షణ శాఖ, రైల్వేశాఖ, హోం శాఖలో ఖాళీలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రైల్వే శాఖలో అకౌంటింగ్ కోసం 2.93 లక్షల ఖాళీలు డిఫెన్స్ లో 2.64 లక్షల ఖాళీలు హోం శాఖలో 1.43 లక్షల ఖాళీలు ఉన్నట్లు గురువారం రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది.
Advertisement
Advertisement
బిజెపి ఎంపీ సుశీల్ కుమార్ మోడీ అడిగిన ప్రశ్నకు, జవాబుగా కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ సహాయ మంత్రి జీతేంద్ర సింగ్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలు పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న రోజ్ గర్ మేళా ఒక ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలంలో పది లక్షల మంది యువతకు లాభదాయకమైన సేవలను అందించడంతోపాటు, ఉపాధి, స్వయం ఉపాధి కల్పించడంలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని తెలిపారు.
రోజ్ గర్ మేళా కార్యక్రమాలు దేశం అంతటా నిర్వహించబడుతున్నాయని, కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థలు, స్వయం ప్రతిపత్త సంస్థల్లో కొత్త నియామకాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. జాతీయ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేశామని, ఉత్తమ విధానాలను అవలంబించేందుకు కేంద్రం, రాష్ట్రాల్లో రిక్రూట్మెంట్ వ్యవస్థలపై సమగ్ర అధ్యయనం చేశామని తెలిపారు.
READ ALSO : “నరసింహ నాయుడు” సినిమాను ఆ రియల్ స్టోరీ ఆధారంగా తీసారని తెలుసా? ఎక్కడ జరిగిందంటే?