Home » “నరసింహ నాయుడు” సినిమాను ఆ రియల్ స్టోరీ ఆధారంగా తీసారని తెలుసా? ఎక్కడ జరిగిందంటే?

“నరసింహ నాయుడు” సినిమాను ఆ రియల్ స్టోరీ ఆధారంగా తీసారని తెలుసా? ఎక్కడ జరిగిందంటే?

by Bunty
Ad

దర్శకుడు బి.గోపాల్, బాలకృష్ణ కాంబినేషన్ కు అప్పట్లో చాలా క్రేజ్ ఉండేది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పలు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అలా బి.గోపాల్ బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన నరసింహనాయుడు సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. 100కు పైగా థియేటర్లలో ఈ సినిమా 100 రోజులు ఆడింది. 105 థియేటర్లలో వంద రోజులు ఆడిన సినిమాగా నరసింహనాయుడు అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

Advertisement

 

ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ అందించిన పవర్ ఫుల్ డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా 2001 సంక్రాంతి బరిలో దిగింది. అయితే అదే ఏడాది సంక్రాంతికి చిరంజీవి హీరోగా నటించిన మృగరాజు సినిమాతో పాటు వెంకటేష్ నటించిన దేవి పుత్రుడు సినిమాలు విడుదలయ్యాయి. కానీ నరసింహనాయుడు ప్రభంజనానికి ఈ రెండు సినిమాలు నిలవలేకపోయాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాకు చిన్ని కృష్ణ కథను అందించారు. అయితే ఈ కథను చిన్ని కృష్ణ ఓ నిజ సంఘటన ఆధారంగా చేసుకుని రాసినట్టు తెలుస్తోంది. అప్పట్లో బీహార్ రాష్ట్రంలోని ఓ గ్రామం పైకి కొంతమంది దుండగులు దాడికి వచ్చేవారు.

Advertisement

దాంతో ఆ గ్రామంలోని ప్రజలంతా ఓ నిర్ణయం తీసుకున్నారు. దుండగులను ఎదిరించడానికి ప్రతి ఇంటి నుండి ఓ అబ్బాయిని తీసుకుని ఓ చిన్నపాటి సైన్యాన్ని తయారు చేసుకున్నారు. ఈ కథ న్యూస్ పేపర్ లో వచ్చింది. ఇక ఈ వార్త చదివిన తర్వాత అదే లైన్ పట్టుకొని చిన్నికృష్ణ నరసింహనాయుడు కథను రాసుకున్నారట. ఆ తర్వాత ఆ పరుచూరు బ్రదర్ సహాయంతో ఆ కథకు మెరుగులు దిద్దారు. అలా వచ్చిన నరసింహనాయుడు ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తు పెట్టుకునే సినిమాగా మిగిలిపోయింది.

Read Also : అన్న కొడుకు కోసం బాలయ్య తపన.. కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి

Visitors Are Also Reading