Home » Mohanbabu: బాలకృష్ణ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన మోహన్ బాబు సినిమా ఇదేనా ?

Mohanbabu: బాలకృష్ణ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన మోహన్ బాబు సినిమా ఇదేనా ?

by Sravya

బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకు వెళ్ళిపోతున్నారు మంచి హిట్లు కూడా కొట్టేస్తున్నారు. అయితే దర్శకులు ఎప్పుడైనా సరే సినిమాని చేయాలని అనుకుంటే, మొదట ఎవరినైతే అనుకున్నారో ఆ హీరోని సంప్రదిస్తారు. కథ నచ్చితే ఆ హీరో సినిమా చేయడానికి ఒప్పుకుంటారు. ఒక్కోసారి కథ నచ్చకపోతే రిజెక్ట్ చేస్తూ ఉంటారు. హీరోలు ఒకవేళ ఒక హీరో రిజెక్ట్ చేస్తే దానిని ఇంకో హీరోకి చెప్తారు. ఆ హీరో ఆ సినిమా లో నటించి హిట్టు కూడా కొట్టేయొచ్చు. ఇటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సినీ ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన కథని ఇంకొకరు ఒప్పుకొని హిట్ కొడుతూ ఉంటారు.

టాలీవుడ్ లో సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కెరియర్ లో 500 పైగా సినిమాలు చేశారు. విలన్ గా క్యారెక్టర్, ఆర్టిస్టుగా, హీరోగా, సహాయ దర్శకుడుగా, నిర్మాతగా ఎన్నో పాత్రలు మోహన్ బాబు మెప్పించడం జరిగింది. మోహన్ బాబు మనసులో ఏది అనుకుంటే అది కరెక్ట్ గా పైకి చెప్పిస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో చాలా మందిని సైతం మోహన్ బాబు లెక్కచేయరు. వరుస ప్లాపులతో మోహన్ బాబు ఉన్న సమయంలో కె రాఘవేంద్ర ఒక సినిమా చేసి పెట్టాలని అడిగారు.

జగదేకవీరుడు వంటి సూపర్ హిట్ తర్వాత మోహన్ బాబుతో సినిమా ఎందుకు..? పైగా రీమేక్ ఎందుకు సమస్య అవుతుంది అని చాలామంది చెప్పారట. కానీ రాఘవేంద్రరావు వినలేదు అల్లుడుగారు సినిమా చేసి సూపర్ హిట్ కొట్టేశారు. మోహన్ బాబు కెరీర్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ముందు ఈ మూవీ ని మోహన్ బాబు కాకుండా బాలయ్య తో చేద్దామని అనుకున్నారు కానీ బాలయ్య ఆ సినిమాని వదులుకున్నారు అప్పట్లో 300 రోజులు సినిమా ఆడింది మోహన్ బాబు సినిమా కెరియర్ లో బెస్ట్ సినిమాగా నిలిచింది.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading