తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాడు ఈ ఇద్దరు నటులు ఒక వెలుగు వెలిగారు. ఇద్దరు హీరోలుగా స్టార్ హోదాను సంపాదించుకున్నారు. ఇద్దరు కూడా బాగానే సంపాదించారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరయ్యా అంటే.. ఒకటి మోహన్ బాబు , మరొకరు మురళీమోహన్.. ఇందులో మోహన్ బాబు ఎంతటి స్టార్ హీరోగా ఎదిగారో మనందరికీ తెలుసు. ఇక మురళీమోహన్ నిర్మాతగా, వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేశారు.. ముఖ్యంగా ఆయన సినిమాలు ఎక్కువగా ఫ్యామిలీ, క్లాసిక్ కథ బేస్ తోనే ఉండేవి. అలాంటి మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
Advertisement
also read;ఈ 10 మంది హీరోయిన్లు డ్యాన్స్ తో ఇండియన్ సినిమాని షేక్ చేసేశారు..!
తాను సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశానని ఎక్కువగా తాత పాత్రలు చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం మురళీమోహన్ ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో వేదశ్రీ తాతా క్యారెక్టర్ లో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.. ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. మోహన్ బాబుతో గతంలో జరిగిన గొడవ గురించి గుర్తు చేసుకున్నారు.. ఓసారి చొక్కాలు పట్టుకునేదాకా వెళ్లిందని ఆయన అన్నారు. దీనికి కారణం మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు అని తెలియజేశారు.. ఓ రోజు సినిమా నటులతో క్రికెట్ టోర్నమెంట్ ప్లాన్ చేసాం.
Advertisement
స్టార్ హీరోలైన బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్,చిరంజీవిలను కెప్టెన్లుగా పెట్టాం..ఈ జట్లు ఒక్కొక్క మ్యాచ్ ఆడి అందులో గెలిచినవారు ఫైనల్ వెళ్లేందుకు ప్లానింగ్ చేసాం. మ్యాచ్ ఉదయం మొదలై అర్ధరాత్రి కల్లా పూర్తయ్యేలా షెడ్యూల్ ఉంది. ఇక చివరి సమయంలో మోహన్ బాబు వచ్చి విష్ణు కూడా ఆడతారు అంటూ చెప్పాడు.. అందుకు నేను ఒప్పుకోలేదు. దీనికి ప్రధాన కారణం విష్ణు అప్పటికి యాక్టర్ కాదు. కానీ మేము మ్యాచ్ ప్లాన్ చేసింది కేవలం యాక్టర్స్ తో మాత్రమే. దీంతో మోహన్ బాబుతో హీరోల పిల్లలు, మేనల్లుల్ల కోసం మ్యాచ్ కాదని కుదరదని చెప్పాను.
దీంతో మోహన్ బాబు సీరియస్ అయి నేను అడిగితే నో అంటావా అంటూ నా మీదికి వచ్చాడు. నేను కూడా తగ్గేదెలే అనే విధంగా చాలా సీరియస్ అయి ఇద్దరం చొక్కాలు పట్టుకునేదాకా వచ్చాం.. దీంతో అక్కడున్న వారంతా మిమ్మల్ని ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదు అన్నారు. ఈ గొడవ జరిగిన సరిగ్గా రెండు రోజుల తర్వాత మోహన్ బాబు వచ్చి సారీ బ్రదర్ అంటూ ఆవేశంతో అలా చేశాను అని చెప్పేశారు. తర్వాత మేమిద్దరం కలిసి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నామని చెప్పారు మురళీమోహన్.
also read;కొత్త ఏడాదిలో ఈ 3 రాశుల వారికి గజలక్ష్మి రాజయోగమే..?