Home » ‘మోహన్ బాబు’ కష్టాల్లో ఉన్నప్పుడు ‘రజిని’ చేసిన ఈ సహాయం ఏంటో తెలుసా ?

‘మోహన్ బాబు’ కష్టాల్లో ఉన్నప్పుడు ‘రజిని’ చేసిన ఈ సహాయం ఏంటో తెలుసా ?

by AJAY
Ad

డైలాగ్ కింగ్ మోహన్ బాబు రీసెంట్ గా స‌న్ ఆఫ్ ఇండియా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ఈ చిత్రం ఆశించినమేర విజ‌యం సాధించ‌లేక‌పోయింది. అయితే ఒక‌ప్పుడు మాత్రం మోహ‌న్ బాబు టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగారు. ఆయ‌న సినిమాల‌కు వ‌సూళ్ల వ‌ర్షం కురిసేది..అంతే కాకుండా మోహ‌న్ బాబు సినిమాలకు భారీ ఓపెనింగ్స్ కూడా ఉండేవి. ఇదిలా ఉంటే ఇండ‌స్ట్రీలోని చాలా మంది పెద్ద‌ల‌తో మోహ‌న్ బాబుకు ఎంతో స్నేహం ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే.

ALSO READ : పుష్ప‌లో పోలీస్ గా అద‌ర‌గొట్టిన స‌త్రు ఎవ‌రు..? సుకుమార్ కు ఏమ‌వుతాడో తెలుసా..!

Advertisement

 

ముఖ్యంగా మోహ‌న్ బాబుకు ఎవ‌రైనా న‌చ్చితే వారి గురించి అనేక‌సార్లు చెబుతుంటారు. అయితే మోహ‌న్ బాబు ఎక్కువ‌గా ప్ర‌స్థావించే పేర్ల‌లో ర‌జినీకాంత్ మరియు దివంత‌గ ద‌ర్శ‌క‌నిర్మాత దాస‌రినారాయ‌ణ రావు పేర్లు ఎక్కువ‌గా వినిపిస్తుంటాయి. వీరిద్ద‌రూ త‌న‌కు ఎంతో సాయ‌ప‌డ్డార‌ని చెబుతుంటారు. అయితే మోహ‌న్ బాబుకు ర‌జినీకాంత్ ఒకానొక సంధ‌ర్బంలో రూ.45ల‌క్ష‌లు అడ‌కుండానే సాయం చేశార‌ట‌.

Advertisement

ఈ విష‌యాన్ని మోహ‌న్ బాబు ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. వ‌రుస‌గా సినిమాలు ఫ్లాప్ అయిన త‌ర‌వాత తాను ఆర్థిక ఇబ్బందులు ఎదురుకున్నాన‌ని చెప్పారు. అయితే అదే స‌మయంలో ర‌జినీకాంత్ ఓ సినిమా షూటింగ్ కోసం రాజ‌మండ్రి వ‌చ్చార‌ని చెప్పారు. దాంతో త‌న స్నేహితుడు వ‌చ్చాడ‌ని తాను కూడా క‌లిసేందుకు వెళ్లాన‌ని చెప్పారు. ఇద్ద‌రూ కారులో వెళుతుండ‌గా ఓ సూట్కేస్ ఇచ్చి తీసుకోమ‌న్నాడ‌ని తెలిపాడు.

అది ఓపెన్ చేస్తే రూ.45ల‌క్ష‌లు ఉన్నాయని మోహ‌న్ బాబు తెలిపారు. డ‌బ్బు ఎందుక‌ని అడిగితే నాకు తెలుసు నీకు డ‌బ్బు టైట్ గా ఉంద‌ని….సినిమా హిట్ అయిన త‌ర‌వాత ఇవ్వు అంటూ చెప్పార‌ట‌. ఈ విష‌యాన్ని మోహ‌న్ బాబు గుర్తు చేసుకుని ఎంతో ఎమోష‌నల్ అయ్యాడు. ర‌జినీ కాంత్ ది త‌న‌ది ఏమీ ఆశించ‌ని స్వ‌చ్చ‌మైన స్నేహ‌మ‌ని చెప్పారు.

Visitors Are Also Reading