టాలీవుడ్ ప్రేక్షకుల మదిని దోచుకున్న హీరోలలో ఉదయ్ కిరణ్ ఒకరు. చిత్రం అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఉదయ్ కిరణ్ వరుస హిట్లతో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. ముఖ్యంగా అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా ఉదయ్ కిరణ్ పేరు సంపాదించుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల ఆత్మ** చేసుకున్నాడు. ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోగా మారారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి భళా అనిపించుకున్నారు.
READ ALSO : Vidudhala Part 1 Review – ‘విడుదల’ రివ్యూ..అంచనాలకు మించి ఉందిగా !
Advertisement
ఆ తర్వాత చిత్రం,మనసంతా నువ్వే, నువ్వు నేను,సినిమాలో నటించి ఒక్కసారిగా ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగారు. అలా ఉదయ్ కిరణ్ ఎంత స్పీడ్ గా స్టార్డం తెచ్చుకున్నారో అంతే స్పీడ్ గా డౌన్ ఫాల్ అయ్యారు. కాగా… ప్రముఖ దర్శకుడు మోహన్ ఆల్రక్..ఉదయ్ కిరణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ దర్శకుడు మోహన్ ఆల్రక్ మాట్లాడుతూ మెగాస్టార్ పెద్ద కూతురుతో ఎంగేజ్మెంట్ తర్వాత ఉదయ్ కిరణ్ కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కోవడం అనేది అవగాహన లేని మాట అని ఆయన తెలిపారు.
Advertisement
READ ALSO : ప్రియురాలి రూపంలో నరరూప రాక్షసి.. ప్రియుడిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి చేసిన పని..ఏంటంటే ?
చిరంజీవి చాలా ఇష్టపడి ఉదయ్ కిరణ్ ను అల్లుడిగా చేసుకోవాలని అనుకున్నారని, మెగాస్టార్ టాలెంట్ ఎక్కడ ఉన్నా ప్రోత్సాహిస్తారని మోహన్ ఆల్రక్ వెల్లడించారు. ఉదయ్ తనంతట తాను వద్దని చెప్పడంతో… ఆ పెళ్లి ఆగిపోయిందని మోహన్ అల్రఖ్ అన్నారు. తనకు తెలిసిన విషయం ఇదేనని ఆయన చెప్పుకోచ్చారు. ఎటువంటి కారణాలవల్ల పెళ్లి చేసుకోలేదో మనం చెప్పలేమని మోహన్ ఆల్రక్ వెల్లడించారు. అల్లు రామలింగయ్య, చిరంజీవిని ఏ విధంగా అల్లుడిని చేసుకోవాలని అనుకున్నారో, అదే విధంగా చిరంజీవి ఉదయ్ కిరణ్ ను అల్లుడు చేసుకోవాలని అనుకున్నారని మోహన్ ఆల్రక్ తెలిపారు. మోహన్ ఆల్రక్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
READ ALSO : మరణించిన తర్వాత “సౌందర్య” గారిని ఎలా గుర్తు పెట్టారో తెలుసా ? వింటూనే కన్నీళ్లు ఆగవు !