Home » Mohammed Siraj : సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ కు సిరాజ్‌ దూరం !

Mohammed Siraj : సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ కు సిరాజ్‌ దూరం !

by Bunty
Ad

Mohammed Siraj : వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. 9 మ్యాచ్లకు తొమ్మిది గెలిచి ఓటమి ఎరగని జట్టుగా లీగ్ దశను ముగించేసింది. ఆదివారం నెదర్లాండ్స్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో సమిష్టిగా రాణించిన రోహిత్ సేన 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ముందుగా విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిన టీమిండియా తర్వాత బౌలింగ్ లో సత్తా చాటింది.

Mohammed Siraj Sidelined by Throat Injury

అసాధారణమైన విజయంతో సెమీస్ కు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకుంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 410 పరుగులు చేసింది. అందులో శ్రేయస్ అయ్యర్ 94 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 128 పరుగుల వద్ద నాటౌట్. కేఎల్ రాహుల్ 64 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 102 పరుగులు చెప్పాలంటే విద్వాంసకర శతకాలతో చెలరేగగా, ఇంకా కెప్టెన్ రోహిత్ శర్మ 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు. ఇంకా గిల్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు. విరాట్ కోహ్లీ 56 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 51 పరుగులు.

Advertisement

Advertisement

చెప్పాలంటే ప్రతి ఒక్కరు హఫ్ సెంచరీలతో సత్తాచాటారు. అయితే…ఈ మ్యాచ్‌ లో బౌలర్‌ సిరాజ్‌ గాయపడ్డాడు. క్యాచ్‌ పట్టబోయి.. గొంతుకు దెబ్బ దగిలించుకున్నాడు సిరాజ్‌. దెబ్బ తగలగానే గ్రౌండ్‌ నుంచి బయటకు పోయిన సిరాజ్‌… చికిత్స అనంతరం బౌలింగ్‌ చేశాడు. కానీ నవంబర్‌ 15న జరిగే న్యూజిలాండ్‌ పై సెమీస్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కు మహమ్మద్‌ సిరాజ్‌ దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ సిరాజ్‌ దూరం అయితే… అతని స్థానంలో ప్రసిద్ధ్‌ కృష్ణ జట్టులోకి రానున్నాడని చెబుతున్నారు.

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading