Home » కోహ్లీకి పాకిస్థాన్ లో పెరుగుతున్న మద్దతు..!

కోహ్లీకి పాకిస్థాన్ లో పెరుగుతున్న మద్దతు..!

by Azhar
Ad

విరాట్ కోహ్లీకి పాకిస్థాన్ నుండి మద్దతు అంది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు క్రికెట్ లో ఎవరిని చూసిన అందరూ విరాట్ కోహ్లీ యొక్క వైఫల్యం గురించే మాట్లాడుతున్నారు. అతను గత మూడేళ్ళుగా సెంచరీ చేయలేకపోవడం అందుకు ప్రధానం కారణం. అలాగే ఈ ఏడాది ఐపీఎల్ తో పాటుగా ఇంగ్లాండ్ పర్యటనలో కూడా విరాట్ ఆకట్టుకోలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు జట్టుకు దూరంగా ఉన్నాడు. విండీస్ పర్యటన నుండి రెస్ట్ తీసుకున్నాడు. అందువల్ల అతనిపైన చాలా విమర్శలు వస్తున్నాయి.

Advertisement

అయితే ముఖ్యంగా కోహ్లీని మాన భారత మాజీ ఆటగాళ్లే ఎక్కువగా విమర్శిస్తున్నారు. ఇక కోహ్లీ పని అనేది అయ్యిపోయిందని అతడిని జట్టు నుండి తీసేయాలని అంటున్నారు. కపిల్ దేవ్ వంటి వారు ఇలాంటి కామెంట్స్ చేయడం పెద్ద దుమారం రేపాయి. కానీ ఇలాంటి సమయంలో విరాట్ కు విదేశీ మాజీ ఆటగాళ్ల నుండి ఎక్కువ మద్దతు ఏది వస్తుంది. మరి ముఖ్యంగా మన దాయాధి దేశం అయినా పాకిస్థాన్ ను చెందిన ఆటగాళ్లు, మాజీ ఆటగాళ్లు అందరూ విరాట్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆ జాబితాలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ కూడా చేరాడు.

Advertisement

తాజాగా మహ్మద్ యూసఫ్ మాట్లాడుతూ.. భారత జట్టుకు కోహ్లీ ఇప్పటికే ఎన్నో చేసాడు. వసంచిన్ తర్వాత ఆ రేంజ్ లో పరుగులు అనేవి చేసాడు. గత 11 ఏళ్లలో అతను 70 సెంచరీలల్ను నమోదు చేసాడు. అతను క్రికెట్ లోకి వచ్చిన తర్వాతి నుండి ఇప్పటివరకు అతని కంటే ఎక్కువ పరుగులు ఎవరు చేయలేదు. కానీ ఇప్పుడు విరాట్ కొంత ప్రెసర్ అనేది ఫీల్ అవుతున్నాడు. అందువల్ల అతనికి కొంత టైం అనేది ఇవ్వాలి. అతనికి ఇందులోనుండి బయటకు రావడానికి ఎవరి సలహాలు అవసరం లేదు. ఎందుకంటే అతను ఇప్పుడు కూడా టాప్ ప్లేయర్ అని మహ్మద్ యూసఫ్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ సెంచరీ చేసిన ప్రయోజనం లేదంట..!

పాకిస్థాన్ ను మట్టికరిపించిన ఇండియా…!

Visitors Are Also Reading