ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్ లో దాయాది పాక్ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో గెలిచాం అని ఆనదించేలోపే ఆ జట్టుకు గట్టి దెబ్బ అనేది తగిలింది. అదేంటంటే.. ఆ జట్టు స్టార్ ఓపెనర్ మొహ్మద్ రిజ్వాన్ జట్టుకు దూరం కానున్నట్లు తెలుస్తుంది. అయితే నిన్న ఇండియాతో జరిగిన మ్యాచ్ లో రిజ్వాన్ గాయపడిన విషయం తెలిసిందే.
Advertisement
బాల్ అందుకోవడానికి గాల్లోకి ఎగిరి ఒక్క కాలుపై కిందపడటంతో.. చాలా సేపు నొప్పితో విలవిలలాడాడు. అయిన కూడా మధ్యలో వెళ్లిపోకుండా మ్యాచ్ మొత్తం ఆడాడు. బ్యాటింగ్ లో కూడా 71 పరుగులు చేసి పాక్ విజయంలో ముఖ్య పాత్ర అనేది పోషించాడు. కానీ ఈ మ్యాచ్ అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించారు అనేది పాక్ మీడియా పేర్కొంది. ఇక అక్కడ అతనికి అన్ని స్కానింగ్స్ అనేది తీశారు.
Advertisement
అందులో గాయం లోతు అనేది తెలియలేదు. దాంతో ప్రస్తుతానికి రిజ్వాన్ ను తర్వాత జారబోయే మ్యాచ్ కు దూరం ఉంచాలని పాక్ జట్టు నిర్ణయం తీసుకుంది. ఒక్క వేల గాయం అనేది బాగా అయితే అతడు ఈ టోర్నీకి పూర్తిగా దూరం కానున్నట్లు తెలుస్తుంది. రిజ్వాన్ దూరం అయితే అది పాక్ కు గట్టి దెబ్బె. ఎందుకంటే ప్రస్తుతం పాక్ లో ఒక్క రిజ్వాన్ మాత్రమే పరుగులు చేస్తున్నాడు. బాబర్ కూడా విఫలం అవుతున్నాడు. అందుకే జట్టు అతనిపైనే ఆధారపడింది.
ఇవి కూడా చదవండి :