భారత జట్టుకి రాహుల్ ద్రావిడ్ కోచ్ గా వచ్చిన తర్వాత నుండి మన జట్టులో చాలా మార్పులు అనేవి వస్తున్న విషయం తెలిసిందే. అయితే అవి ద్రావిడ్ కావాలని చేస్తున్నాడా.. లేక అతనికి పరిస్థితులు అలా ఎదురవుతున్నాయా అనేది తెలియదు కానీ.. రాహుల్ హెడ్ కోచ్ అయిన తర్వాత కెప్టెన్లు, ఓపెనర్లు చాలా మంది మారారు. అయితే ఇప్పుడు టీం ఇండియా వెస్టిండీస్ పర్యటనలో ఉంది. అక్కడ ఈ మధ్యే ధావన్ కెప్టెన్సీలో వన్డే సిరీస్ ను 3-0తో గెలుచుకున్న భారత జట్టు… ఇప్పుడు రోహిత్ కెప్టెన్సీలో 5 టీ20 ల సిరీస్ లో తలపడుతుంది.
Advertisement
ఈ సిరీస్ లో భాగంగానే నిన్న జరిగిన మొదటి టీ20 తర్వాత మళ్ళీ టీం ఇండియా మేనేజ్మెంట్ పై విమర్శాలు అనేవి ఎక్కువయ్యాయి. ఇండియా జట్టుకు మిడిల్ ఆర్డర్ లో బాగా రాణిస్తున్న సూర్య కుమార్ యాదవ్ ను తీసుకువచ్చి నిన్నటి తొలి టీ20 లో ఓపెనర్ గా బరిలోకి దించారు. ఇందులో సూర్య 16 బంతుల్లో 24 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక సూర్య ను ఇలా ఓపెనర్ గా తీసుకురావడంపై టీం ఇండియా అభిమానులతో పాటుగా మాజీ ఆటగాడు మొహ్మద్ కైఫ్ కూడా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అలాగే కెప్టెన్ రోహిత్ ల పై అసంతృప్తి వ్యక్తం చేసాడు.
Advertisement
కైఫ్ మాట్లాడుతూ.. సూర్య కుమార్ ను ఎందుకు ఓపెనర్ గా తీసుకువచ్చారో నాకు అర్ధం కావడం లేదు. ఇంతకముందు పంత్ ను ఓపెనర్ గా చేయాలనీ రెండు మ్యాచ్ లు చూసారు. ఇప్పుడు కూడా అతను జట్టులో ఉన్నపుడు అతడికే మళ్ళీ ఓపెనర్ గా అవకాశం ఇవ్వాలి. కనీసం అతనికి 5 మ్యాచ్ లు అయిన ఓపెనర్ గా అవకాశం ఇవాల్సింది. సూర్య నాలుగో స్థానంలో మంచి ఆటగాడు. పరిస్థితులకు తగ్గిన విధంగా ఆడటం అతని పని. కాబట్టి ఓపెనర్ గా ప్రయత్నిస్తే పంత్ కే అవకాశం మళ్ళీ ఇవ్వాలి అని కైఫ్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :