పాకిస్థాన్ బాబర్ ఆజాం గురించి అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్ లో మూడు ఫార్మట్స్ లో టాప్ 5 లో ఉన్న ఒక్కే ఒక్క ఆటగాడిగా బాబర్ కొనసాగుతున్నాడు. ఐసీసీ టీ20, వన్డే ఫార్మాట్ లో మొదటి స్థానంలో ఉన్న బాబర్.. టెస్టులో 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే బాబర్ ఎంత బాగా ఆడిన అతనిపై విమర్శలు అనేవి వస్తుంటాయి.
Advertisement
ఎందుకంటే బాబర్ ఎప్పుడు పెద్ద జట్ల పైన ఆడకపోవడమే. ప్రతిసారి చిన్న జట్ల పైన సెంచరీలు చేస్తూ రావడం వల్లే అతనికి అంత గుర్తింపు అంది రావడం లేదు. ఇక తాజాగా పాకిస్థాన్ మాజీ ఆటగాడు మహమ్మద్ హఫీజ్ కూడా బాబర్ పై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ అనేవి చేసాడు. బాబర్ ఇకనైనా తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాలి అని సూచించాడు. బాబర్ ఓపెనర్ గా కాకుండా మూడో స్థానంలో బ్యాటింగ్ చెయ్యాలి అన్నాడు.
Advertisement
బాబర్ ఓపెనర్ గా పరుగులు చేస్తున్న.. అతని స్ట్రైక్ రెట్ అనేది చాల తక్కువగ ఉంటుంది. అందుకే అతడిని ఓపెన్ గా వెళ్ళవద్దు అని సూచించాడు. మ్యాచ్ లో పవర్ ప్లే అనేది చాల ముఖ్యం అని.. బాబర్ దానిని తన కంఫర్ట్ జోన్ గా వాడుకుంటున్నాడు అని చెప్పాడు. ఈ ప్రపంచ కప్ వరకు చూసి.. అతను తన బ్యాటింగ్ విధానంలో మార్పులు తేకపోతే ఓపెనర్ గా తప్పించాలి అని పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :