భారత మాజీ కెప్టెన్.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఉన్న మహమ్మద్ అజారుద్దీన్ పై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అయితే కరోనా కారణంగా హైదరాబాద్ లో గత మూడేళ్ళుగా ఇంటర్నేషనల్ మ్యాచ్ తో పాటుగా.. ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా జరగలేదు. కానీ ఈ నెల 25న ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరిగే మూడో టీ20 మ్యాచ్ అనేది మన హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది.
Advertisement
దాంతో ఈ మ్యాచ్ లైవ్ లో చూడాలి అనుకున్న ఫ్యాన్స్ ను.. హెచ్సీఏ నిరాశపరిచింది. టికెట్లను అమ్మకుండా బ్లాక్ లోకి తరలించింది. అయితే ఈ విషయం సీరియస్ కావడంతో నిన్న తెలంగాణ ప్రభుత్వం టికెట్లను అమ్మాలని సూచించగా… ఈరోజు ఉదయం ఎటువంటి ప్లానింగ్ అనేది లేకుండా.. టికెట్లను అమ్మకం కోసం పిలుపు ఇచ్చింది. దాంతో ఉప్పల్ స్టేడియానికి అభిమానులు పోటెత్తారు.
Advertisement
అందువల్ల పెద్ద ఎత్తున తొక్కిసలాట అనేది జరిగింది. చాల మంది గాయపడ్డారు. కొంతమంది తమ ప్రాణాలతో కూడా పోరాడుతున్నారు. ఇటువంటి సమయంలో ఇవ్వని చిన్న విషయాలు అని అజారుద్దీన్ కామెంట్స్ చేసాడు. పెద్ద మ్యాచ్ కోసం ఇలాంటి చిన్న చిన్న తప్పులు జరుగుతాయి అని.. అందులో తమ తప్పు లేదు అని పేర్కొన్నాడు. దాంతో చేసిన తప్పును ఒప్పుకోకపోగా.. ఇది చిన్న విషయం అని అజారుద్దీన్ కామెంట్స్ చెయ్యడం వల్ల సోషల్ మీడియా వేదికగా.. ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
ఇవి కూడా చదవండి :