Home » పంత్ వల్ల కాదు.. మొత్తం ఇంగ్లాండ్ బౌలర్లదే…!

పంత్ వల్ల కాదు.. మొత్తం ఇంగ్లాండ్ బౌలర్లదే…!

by Azhar
Ad
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు గాని.. అక్కడి ఆటగాళ్లకు గాని మన ఇండియా అంటే అసలు పడదు. ఎప్పుడు ఎలా ఇండియాను విమర్శించాలి.. ఎప్పుడు అక్కడి ఆటగాళ్లను అవహేళన చేయాలి అనే ఆలోచనతోనే ఉంటారు. అందుకే మన ఇండియా పైన ఎక్కువ దృష్టినీ ఉంచి.. తమ ఆటగాళ్లను పటించుకోవడం లేదు. వాళ్ల ఆటగాళ్లకు ఎలా ఉన్న మన వాళ్ల పైన కామెంట్స్ చేయడం మానరు. ఇప్పుడు కూడా అలాంటిదే చేశారు. తన మన భారత బ్యాటర్ రిషబ్ పంత్ పై ఇష్టం వచ్చినట్లు కామెట్స్ చేసారు. పంత్ ఇంగ్లాండ్ లో చేసింది ఏమి లేదు.. అతను సెంచరీ చేయడానికి ఇంగ్లాండ్ బౌలర్లే కారణం అని అంటున్నారు.
ప్రస్తుతం మన టీం ఇండియా ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్ లో పోటీ పడుతుంది అనేది తెలుసు. నిన్న ప్రారంభమైన ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ సెంచరీ చేయడంతో అతనిపై ప్రశంసల జట్లు కురుస్తుంది. ఎందుకంటే పంత్ బ్యాటింగ్ కు వచ్చిన సమయంలో ఇండియా వంద కంటే తక్కువ పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అటువంటి ఇండియాను 300 కంటే ఎక్కువ పరుగులకు చేర్చాడు. ఈ క్రమంలోనే సెంచరీ చేసి.. 111 బంతుల్లో 146 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. అయితే పంత్ ఔట్ అయ్యే సమయానికి ఇండియా పొజిషన్ బాగానే బలపడింది. అందుకే పంత్ ఆడింది చాలా ముఖ్యమైన ఇన్నింగ్స్ అని అందరూ అంటున్నారు.
కానీ పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ అసిఫ్ పంత్ బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ… అసలు పంత్ సెంచరీ ఎలా చేసాడో అర్ధం కావడం లేదు. ఎందుకంటే పంత్ బ్యాటింగ్ లో చాలా టెక్నీక్ లోపాలు అనేవి ఉన్నాయి. అయిన కూడా అతను సెంచరీ చేసాడు అంటే.. అది ఇంహెలాండ్ బౌలర్ల వైఫల్యం అనే నేను అనుకుంటాను. కానీ నాకు పంత్ అంటే ఏం కోపం లేదు అని అసిఫ్ చెబుతున్నాడు. ఇక పంత్, జడేజా వంటి లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ ఆర్మీ స్పిన్నర్లను తీసుకురావడం తప్పు. అయితే పంత్ లెఫ్ట్ హ్యాండర్ అయిన అతను ఎక్కువగా దానిని ఉపయోగించుకోడు అని మహ్మద్ అసిఫ్ పేర్కొన్నాడు.

Advertisement

Visitors Are Also Reading