Home » బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న మొగలిరేకులు సీరియల్ హీరో… ఒక్క రోజుకి ఎంత వసూలు చేస్తున్నాడంటే..?

బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న మొగలిరేకులు సీరియల్ హీరో… ఒక్క రోజుకి ఎంత వసూలు చేస్తున్నాడంటే..?

by Mounika
Ad

రియాల్టీ టీవీ షో బిగ్ బాస్ తదుపరి సీజన్ కోసం తెలుగు ప్రేక్షకులు అప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆరు సీజన్‌లు విజయవంతంగా ముగియడంతో, బిగ్బాస్ షో ఇప్పుడు ఏడవ సీజన్‌కు సిద్ధమవుతోంది. అందుకు తగ్గట్టుగానే తాజాగా విడుదల చేసిన ప్రమోషనల్ టీజర్ కూడా బుల్లితెర ప్రేక్షకులలో ఆసక్తిని రేపుతోంది. గత సీజన్‌ల మాదిరిగానే దీనికి కూడా నాగార్జున హోస్ట్‌గా కొనసాగనున్నారు. ఈ కొత్త సీజన్ ను సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి బిగ్బాస్ నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

ఈసారి బిగ్ బాస్ చూసే ప్రేక్షకులలో మరింత ఉత్కంఠతను పెంచడానికి పూర్తిగా కొత్త గేమ్‌లు, టాస్క్‌లు మరియు కొత్త నిబంధనలను పరిచయం చేస్తున్నారు. అంతే కాకుండా హౌస్ లో పాల్గొనే అభ్యర్థుల విషయంలో కూడా బాస్ నిర్వాహకులు ఎంతో ఆచితూచి అడుగు వేస్తున్నారు. బిగ్ బాస్ షో విషయంలో ఈసారి కంటెస్టెంట్లను కూడా మంచి స్టార్ డమ్ ఉన్నటువంటి వారిని హౌస్ లోకి పంపించాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారట. ఈ క్రమంలోనే పలువురి పేర్లు సోషల్ మీడియాలో బాగా హల్ చల్  చేస్తున్నాయి.

Advertisement

కొన్ని సంవత్సరాల క్రితం బుల్లితెర ప్రేక్షకులను టీవీల ముందు కట్టిపడేసిన సీరియల్ మొగలిరేకులు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సీరియల్ అప్పటిలో ఎంత ఆదరణ పొందిందో ప్రత్యేకించి తెలుగు ప్రేక్షకులకు చెప్పనవసరం లేదు. ఇక ఈ సీరియల్ లోని చాలా మందికి  ఇష్టమైన క్యారెక్టర్ లో ఒకటి ఆర్ కే నాయుడు. ఈ పాత్రలో నటించిన సాగర్ కోసమే చాలామంది మొగలిరేకులు సీరియల్ చూసేవారు. ఈ సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సాగర్, ఆ తర్వాత వెండి తెరపై పలు సినిమాలలో కూడా నటించారు. కానీ ఆ చిత్రాలు సాగర్ కి పెద్దగా సక్సెస్ ను ఇవ్వలేకపోయాయి.

ఈ క్రమంలోనే సాగర్ మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారట. ఇలాంటి తరుణంలోనే తనకు బిగ్ బాస్ అవకాశం వచ్చిందని టాక్ వినిపిస్తుంది. ఇలా సాగర్ బిగ్ బాస్ షోలో అవకాశమందుకున్నారని, ఈ షోలో పాల్గొనేందుకు సాగర్ ఒక రోజుకి రూ.70 నుంచి 80 వేలు వసూలు చేస్తారని సమాచారం విన్పిస్తుంది. మరి మొగలిరేకులు సాగర్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో.. బిగ్బాస్ షో ప్రచారం అయ్యేవరకు వేచి చూడవలసిందే.

మరికొన్ని  ముఖ్యమైన వార్తలు :

రెండుసార్లు లవ్ ఫెయిల్యూర్ అయిన ఈ హీరోయిన్ జీవితం చివరికీ ఏమైందంటే ?

Sai Pallavi: సాయిపల్లవికి ఉన్న ఈ విచిత్రమైన అలవాటు గురించి తెలుసా? అది కూడా తింటారా?

నాగార్జున నటించిన ‘ప్రెసిడెంట్ గారి పెళ్లాం’ మూవీ రహస్యాలు ఇవే..!

 

 

Visitors Are Also Reading