Home » క్రికెట్ లో ఆ నియమాన్ని మార్చాలి.. అది ఘోరం..!

క్రికెట్ లో ఆ నియమాన్ని మార్చాలి.. అది ఘోరం..!

by Azhar
Ad

ఇండియా, ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య తాజాగా ముగిసిన వన్డే సిరీస్ ఏది పెద్ద చర్చకు తెర లేపింది అనే చెప్పాలి. ఈ సిరీస్ చివరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ యొక్క ఆఖరి బ్యాటర్ బాల్ వేయకముందే క్రీజు దాటినందుకు భారత బౌలర్ దీప్తి శర్మ రన్ ఔట్ చేసింది. ఇప్పుడు యుద్ధే పెద్ద రచ్చగా మారింది. అయితే ఇలా ఔట్ చేయవచ్చు అని ఐసీసీ నియమాల్లోనే ఉంది.

Advertisement

కానీ ఇప్పుడు ఆ నియమని మార్చాలి అని.. అది చాలా ఘోరం అని ఇంగ్లాండ్ ఆటగాడు మొయిన్ అలీ అన్నాడు. తాజాగా ఈ రన్ ఔట్ వివాదం పై అలీ మాట్లాడుతూ.. ఇలా రన్ ఔట్ చేయవచ్చు అని అనే నియమని ఐసీసీ తొలగించాలి… అది తప్పు అని చెప్పాలి అన్నాడు. కానీ ప్రస్తుతం ఇది ఐసీసీ రూల్స్ లో ఉంది కాబట్టి.. ఆ రన్ ఔట్ చేసే అధిరం బౌలర్ కు పూర్తిగా అంటుంది.

Advertisement

అయితే ఈ ఔట్ అనేది మిగిలిన వాటిలా కాదు. ఇందులో బ్యాటర్ జోక్యం అనేది ఉండదు. కానీ నాన్ స్ట్రైకర్ బంతి వేసే వరకు క్రీజులో ఉండాలి. అది తప్పనిసరి. కానీ బౌలర్ బంతి నేరుగా వేస్తాడు అని ఆ నాన్ స్ట్రైకర్ ముందుకు మూమెంట్ లో ఉంటాడు. అలాంటి సమయంలో బౌలర్ మధ్యలో ఆగి ఇలా ఔట్ చేస్తున్నప్పుడు మూమెంట్ ను మార్చుకోవడం చాలా కష్టం. కాబట్టి ఐసీసీ ఈ విషయంలో ఏది ఒక్క ఆలోచన చేయాలి అని మొయిన్ అలీ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

షమీ ప్రపంచ కప్ జట్టులోకి రావాల్సిందే..?

ఇండియాను క్యాష్ చేసుకోవాలనుకున్న ఇంగ్లాండ్..!

Visitors Are Also Reading