తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసిఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.. గత కొంతకాలంగా ఈ కేస్ విచారణ జరుగుతుంది. ఈ తరుణంలో సిబిఐ ఎమ్మెల్సీ కవితను విచారించడానికి ఇప్పటికే పలుమార్లు లేఖలు పంపింది. కానీ ఆమెకు వీలు లేకపోవడంతో డిసెంబర్ 11న అందుబాటులో ఉంటానని చెప్పడంతో సిబిఐ తన నివాసంలో విచారణ చేపట్టింది..
Advertisement
ALSO READ:మహేష్ బాబుది ఒరిజినల్ హెయిర్ కాదా..ప్లాంటేషన్ కి ఎప్పుడు మారారంటే..?
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితను బంజారాహిల్స్ లోని తన సొంత నివాసంలో సిబిఐ డిజి రాఘవేంద్ర వాత్స నేతృత్వంలో విచారణ చేపట్టారు.. మరి ఈ విచారణలో ఏం తేలిందో మనం ఇప్పుడు చూద్దాం.. ఢిల్లీ లిక్కర్స్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సిబిఐ అధికారులు విచారించారు.. కవిత నివాసానికి 11 మంది అధికారులు వచ్చారు.. ఇందులో ఒక మహిళా అధికారి కూడా ఉన్నట్టు తెలుస్తోంది.. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా సీబీఐ అధికారులు కవితను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.. ప్రధాన నిందితుడైన అమిత్ అరోరా స్టేట్మెంట్ ద్వారా కవితను ప్రశ్నించినట్టు సమాచారం.
Advertisement
అయితే న్యాయవాదుల సమక్షంలోనే సిబిఐ బృందం ప్రశ్నల వర్షం కురిపించింది.. ఈ క్రమం లో కవిత స్టేట్మెంట్లు సిబిఐ అధికారులు రికార్డు కూడా చేసినట్టు తెలుస్తోంది. దాదాపుగా ఏడు గంటల పాటు ఈరోజు విచారణ కొనసాగింది.. ఇక్కడితో ముగుస్తుంది అనుకున్న విచారణ మళ్లీ రేపు కూడా ఉంటుందని సిబిఐ అధికారులు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.. ఇప్పటికే కవిత ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు.. న్యాయ నిపుణుల సలహాల మీద ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరయ్యారని తెలుస్తోంది..
ALSO READ: