తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. నిత్యం ఎవరో ఒకరూ మరెకరిపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈమధ్య కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయమని స్పష్టం చేసిన వద్ద నుంచి ఒకరిపై ఒకరు విమర్శించుకోవడం ప్రతిరోజూ చోటుచేసుకుంటొంది. తాజాగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఎఫ్‌సీఐ ఉండే నిలువలను ప్రజలకు అందించాలని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి ఎఫ్‌సీఐ ధాన్యం సేకరించాలని, సేకరించిన ధాన్యమును వరదలు, విపత్తులు వంటి ఎమర్జెన్సీ సమయంలో ఎఫ్‌సీఐ ద్వారా ప్రజలకు అందించాలని పేర్కొన్నారు. బీజేపీ అధిష్టానం మాత్రం ధాన్యం నిలువ చాలా ఉన్నది, కొనుగోలు చేయలేము అని చెబుతోంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం ఏడేండ్ల నుంచి కేంద్రం కొంటుందని మాట్లాడడం ఎంతవరకు సబబు అని పేర్కొన్నారు. ధాన్యాన్ని కేంద్రం కొనకపోతే ఎవరు కొంటారు అని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. బీజేపీ నాయకులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు పల్లారాజేశ్వర్‌రెడ్డి.