Home » మిథాలీ రాజ్ టాప్ రికార్డ్స్ ఇవే…!

మిథాలీ రాజ్ టాప్ రికార్డ్స్ ఇవే…!

by Azhar
Ad

భారత జట్టుకు 23 ఏళ్ళు సేవలు అందించిన మిథాలీ రాజ్ ఈరోజు అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికింది. అయితే ఈ 23 ఏళ్ల శుద్ర్గా కెరియర్ లో తన పేరిట ఎన్నో రికార్డులను నెలకొల్పింది మిథాలీ. అందులో టాప్ 10 రికార్డులను ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది ఆమె కెరియర్. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా వన్డే కెరీర్ లో 22 సంవత్సరాల 274రోజుల పాటు కొసగిన ఏకైన ప్లేయర్ మిథాలీనే. అలాగే కెప్టెన్ గా ఎక్కువ మ్యాచ్ లు ఆడింది. టీమిండియా కెప్టెన్‌గా మిథాలీ రాజ్ 155 వన్డే మ్యాచ్‌ లు ఆడింది. ఇక ప్లేయర్ గా 232 మ్యాచ్ లు పూర్తి చేసుకుంది.

Advertisement

ఇక మహిళల వన్డే క్రికెట్లో అత్యధికంగా7805 పరుగులు చేసిన ప్లేయర్‌గా ఉంది. మిథాలీ అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ చేసింది. 1999 జూన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన ఆమె ఆడిన మొదటి మ్యాచ్‌లో మిథాలీ రాజ్ 114పరుగులు చేసింది. ఇక ఈ సెంచరీ తోనే క్రికెట్లో అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్ లో ముఠాలో వయస్సు 16 ఏళ్ల 205రోజులు. ఇక వన్డేల్లో ఎక్కువసార్లు 90 కంటే ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్‌ మిథాలీ. మొత్తం 5 సార్లు ఈ ఘనత అందుకుంది. అలాగే వరుసగా 7సార్లు హాఫ్ సెంచరీ చేసిన తొలి మరియు ఏకైక క్రికెటర్ కూడా మిథాలీనే. 2017 లో ఈ ఘనత అందుకుంది.

Advertisement

ఇక టెస్ట్‌ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 214 పరుగులు చేసింది మిథాలీ. 2002 ఆగస్టులో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ లో ఈ ఫిట్ సాధించింది. ఇదే మ్యాచ్ లో టెస్ట్‌ల్లో అతి చిన్న వయసులో డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్ గా నిలిచింది. ఈ మ్యాచ్ సమయంలో మిథాలీ వయసు కేవలం 19ఏళ్ల 254 రోజులు. మళ్ళీ ఇదే మ్యాచ్ లో మిథాలీ 7వ వికెట్‌కు జులియన్ గోస్వామితో కలిసి అత్యధికంగా 157పరుగుల భాగస్వామ్యాన్ని ఏర్పరిచింది. ఇప్పటివరకు ఈ వికెట్ కు ఇదే అత్యధికం. అలాగే వన్డేల్లో 64 తో అత్యధిక అర్ధ శతకాలు చేసిన ప్లేయర్‌గా మిథాలీ ఉంది.

ఇవి కూడా చదవండి :

మిథాలీ వీడ్కోలుతో కెప్టెన్ గా హర్మాన్ ప్రీత్..!

భారత ఆటగాళ్లు లేకుండానే టెస్ట్ టాప్ 5..!

Visitors Are Also Reading