Home » ఆనిమల్ సినిమాలో ఈ పొరపాట్లు లేకుండా ఉంటె.. అద్భుతంగా ఉండేదా? ఇంతకీ అవేంటంటే?

ఆనిమల్ సినిమాలో ఈ పొరపాట్లు లేకుండా ఉంటె.. అద్భుతంగా ఉండేదా? ఇంతకీ అవేంటంటే?

by Srilakshmi Bharathi
Ad

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో సినిమా వస్తోందంటే చాలు.. ఆ సినిమాలో హీరో కి ఆటిట్యూడ్ హై లెవెల్ లో ఉంటుంది అన్న టాక్ ఉంటుంది. ఇటీవల ఆయన డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ సినిమాలో కూడా హీరో ఆటిట్యూడ్ పరాకాష్టకు చేరుకుంది. అప్పుడెప్పుడో వచ్చిన అర్జున్ రెడ్డి నుంచి.. నిన్న రిలీజ్ అయినా యానిమల్ సినిమా వరకు హీరోకి ఆటిట్యూడ్ అవసరం అన్నట్లు ఉంటాయి సందీప్ రెడ్డి సినిమాలు. అన్ని సినిమాలు అలానే ఉంటె ఎలా? అన్న టాపిక్ పై నెటిజన్స్ చర్చలు జరుపుతున్నారు.

Advertisement

కొందరు అభిమానులైతే మెత్తగానే చెబుతున్నారు. ఇలానే ఆటిట్యూడ్.. ఆటిట్యూడ్.. అంటూ సినిమాలు తీస్తే జనాలకు విసుగు వచ్చేస్తుంది అని.. ప్రేమతో ముందు చూపుగా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. వాస్తవంగా మాట్లాడితే.. ఇండస్ట్రీకి ఎప్పుడైనా కొత్త టాలెంట్ వస్తే.. నిజంగా అతని ప్రతిభని తెలుగు ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తే ఆదరిస్తారు. అలానే వచ్చిన అర్జున్ రెడ్డిని కూడా ఆదరించారు. అదే ఫ్లో లో సందీప్ రెడ్డి వంగా దూసుకెళ్ళిపోయి “యానిమల్” ని తీశారు. ఇందులో కొన్ని విషయాలని మర్చిపోయారు. ఆ లోటు పట్ల వల్లే సినిమా చూస్తుంటే ఎదో మిస్ అయినా ఫీల్ వస్తుంటుంది.

Advertisement

ఇంకా అర్జున్ రెడ్డి జోరు లోనే ఉన్న సందీప్ ఆడియన్స్ ఏమి కోరుకుంటున్నారో సరిగ్గా ఆలోచించలేదని అనిపిస్తుంది. ఫస్ట్ మైనస్ పాయింట్ ఈ సినిమా రన్ టైం. ఒకటి, రెండు నిమిషాల రీల్స్ కి అలవాటు పడిపోయిన జనం మూడు గంటల 20 నిముషాల పాటు కదలకుండా సినిమా చూడడం అంటే కష్టమే. ఎడిటర్ రోల్ కూడా సందీప్ నే చెయ్యడంతో ఏ సీన్ ను కట్ చేయలేదని అనిపిస్తుంది. అందుకే ఏ సినిమాకి అయినా ఎడిటర్, డైరెక్టర్ ఒక్కరే ఉండకూడదు. లెంగ్త్ ఎక్కువ ఉండాలని అనుకుంటే.. వెబ్ సిరీస్ నే చేసి ఉండాల్సింది. తండ్రి కొడుకుల మధ్య బలమైన ఎమోషన్స్ పండలేదనే అనిపిస్తుంది. ఇది మరో మైనస్. “మితిమీరిన హింస వల్ల సాధించేది ఏంటి.?” అంటూ వచ్చే ఒకే ఒక్క బలమైన సీన్ ని ట్రైలర్ లో చూపించారు. సినిమాలో మాత్రం మితిమీరిన వయొలెన్స్. సినిమా చూస్తుంటే కథ మొత్తం ముందే తెలిసి పోతూ ఉంటుంది. ఇది మరో మైనస్. ఈ లోటు పాట్లు లేకుంటే యానిమల్ సినిమా రిజల్ట్ మరోలా ఉండేది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading