Home » రికార్డుల‌కు బ్రేక్ చేసిన ఆనాటి మిస్స‌మ్మ …రెట్రో రివ్యూ!

రికార్డుల‌కు బ్రేక్ చేసిన ఆనాటి మిస్స‌మ్మ …రెట్రో రివ్యూ!

by Azhar

తెలుగు సినిమా చరిత్రలో ఓ మాణిక్యంగా నిలిచిపోయిన చిత్రం మిస్సమ్మ ఈ సినిమా అప్పుడే కాదు.ఇప్పటి పరిస్థితులకూ అద్దం పట్టినట్లు ఉంటుంది. ఈ చిత్ర క‌థాంశం.ఆ రోజుల్లో ఇంత ముందు చూపుతో ఈ సినిమా కథ ఎలా రాశారు అని ఆలోచిస్తే ఆశ్చర్యం కలగకమానదు. అప్ప‌ట్లో మిస‌మ్మ అంత పెద్ద హిట్ అయింది. ఇప్ప‌టికీ ఆ సినిమా న‌చ్చ‌ని వాళ్ళు ఎవ్వ‌రూ ఉండ‌రు. ఆ త‌ర్వాత ఆ పేరుతో ఎన్నో చిత్రాలు వ‌చ్చాయి. కానీ అంత పెద్ద హిట్ అయితే అవ్వ‌లేదు.

అయితే ఈ సినిమా కథ విషయంలో అప్ప‌ట్లో పలు వివాదాలు జరిగాయి. ఇంతకీ ఆ వివాదాలకు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.1955 సమయంలో తెలుగు సినిమా పరిశ్రమను నాగిరెడ్డి, చక్రపాణి ఏలుతున్నారు. అదే సమయంలో చక్రపాణి రచనల విషయంలో విమర్శలు బాగా వచ్చేవి. అంతేకాదు. … తనే సినిమా పరిశ్రమను ముందుకు తీసుకెళ్తున్నట్లు ఫీలయ్యేలా స్టోరీలు రాసేవాడు. ఈతీరుపై పలువురు విమర్శలు కూడా చేసేవారు. తను ఓ కథ రాస్తే దాన్ని సినిమా చేయాల్సిందే అని పట్టుబట్టి కూర్చునేవాడు. మిస్సమ్మ కథ విషయంలో సేమ్ ఇలాంటి పరిస్థితే కొనసాగింది.ఆయన రాసిన కథను చూసి చాలా మంది పలు విమర్శలు చేశారు.50 ఏళ్ళ‌ క్రితం సినిమా కథలా కాకుండా.పూర్తి భిన్నంగా ఈ కథ ఉంటుంది. ఓ పెళ్లికాని అమ్మాయి పూర్తి పరిచయం లేని ఓ అబ్బాయిని నమ్మి అతడి భార్యగా వెళ్లేందుకు రెడీ అవుతుంది.ఆ అబ్బాయికి వేరే భార్య కూడా ఉంటుంది.ఇదే పాయింట్ తో క్లాసిక్ సినిమాను తెర కెక్కించాడు చక్రపాణి.

 

నిజానికి నిర్మాత నాగిరెడ్డికి మిస్సమ్మ సినిమా మీద ఎలాంటి నమ్మకం లేదు.ఇలాంటి కథతో సినిమా చేస్తే అట్టర్ ఫ్లాప్ ఖాయం అనుకున్నాడు. కానీ చక్రపాణి స్నేహం కోసం కాదనలేకపోయాడు. ఈ సినిమా నిర్మాణంలో తనూ భాగస్వామి అయ్యాడు. మొత్తంగా ఈ సినిమాపై ఎలాంటి నమ్మకం లేకుండా రిలీజ్ అయ్యింది. రిలీజ్ కావడానికి ముందు కూడా చాలా ఆలోచించారు. ఇంత ఫాస్ట్‌గా ఆలోచించే వాళ్ళు ఉంటారా.. ఆ రోజుల్లో .. ఈ సినిమా ఆడదు పక్కన పెట్టాలని సూచించారు కూడా. అయినా వినకుండా చక్రపాణి విడుదల చేశాడు. ఈ సినిమా కనీవినీ ఎరుగని రీతిలో విజయం సాధించింది. తెలుగులో మంచి క్లాసిక్ సినిమాగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. మ‌రి అంత గొప్ప సినిమాని ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ అదే పేరు పెట్టి సినిమాని తీస్తున్నారు. ఆ సినిమాలా తీయ‌లేక‌పోయినా ప‌ర్వాలేదుకాని దాని విలువ‌లు కాపాడితే చాలు. పేర్లు పెట్ట‌డం గొప్ప కాదు. క‌థ‌లో అంత‌టి బ‌లం ఉండ‌డం గొప్ప‌. ఆ మ‌ధ్య హీరో శివాజి, భూమిక‌, ల‌య కూడా మిస్స‌మ్మ చిత్రంలో న‌టించారు.

You may also like