రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా వ్యవసాయ పంటల ధరలు రికార్డుకెక్కాయి. గత నెల రోజులుగా మిర్చి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దశలో బంగారంతో పాటు నువ్వా.. నేనా..? అనే విధంగా మిర్చిలోని కొన్ని రకాల ధరలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో కురిసిన వర్షాలకు మిర్చి పంటల దిగుబడి తక్కువ కావడంతో ఒక్కసారిగా వాటి ధరలు పెరుగుతున్నాయి. గడిచిన నెల రోజుల్లోనే సుమాఉ 20వేల రూపాయల వరకు దీని ధరలు పెరిగాయి. ఈ తరుణంలో వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు వచ్చిన సింగిల్ పట్టి రకం మిర్చి ధర క్వింటాకు 52వేల రూపాయలు పలికింది.
మరొకవైపు ఈ ధర అన్ని రకాల మిర్చిలకు వర్తించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రకాలకే అధిక ధరలు లభించడంతో అదే క్వాలిటీ మిర్చికి కూడా ధర లభించాలని మార్కెట్ ముందు కొంత మంది రైతులు ఆందోళన చేస్తున్నారు. సాధారణ మిర్చి ధరలు బహిరంగ మార్కెట్‌లలో గత నెల రోజులుగ ఆకాశాన్ని అంటుతున్నాయి. కనీస రకాలు సైతం 20వేలకు పైగా పలుకుతున్నాయి. సాధారణంగా పది లేదా పదిహేను వేల మధ్యలో ఉండే మిర్చి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అయితే సింగిల్ పట్టి, చపాటా రకాలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. వీటిని పచ్చళ్లతో పాటు క్వాలిటీ కారం పొడి లభిస్తోంది.
ఈ ఏడాది వేసిన మిర్చి పంట రైతుల్లో నిరాశనే మిగిలిచింది. ధర పెరుగుతున్న ఉత్పత్తి మాత్రం లేదు. ఎందుకంటే గత రెండు నెలల క్రితం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలకు దాదాపు మిర్చి పంటలన్ని నాశనం అయ్యాయి. దీంతో 90 శాతం రైతులు పంటలు వర్షం పాలు అయ్యాయి. దీంతో దిగుబడి రాలేదు. దీంతో కొన్ని ప్రత్యేక రకాల మిర్చితో పాటు సాధారణ మిర్చి రకానికి కూడా కనీస 15వేలకు పైగానే ఉండడంతో రైతులకు కొంత ఊరట కలిగింది.
Also Read : KOMURAMBHEEMUDO SONG : వార్నీ… కొమురంభీముడో పాటను అక్కడ నుండి కాపీ చేశారా..?