తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలయ్యకు ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బాలకృష్ణ కు సూటిగా చెబుతున్నా… ఫ్లూటు జింక ముందు ఊదు… సింహం లాంటి జగన్మోహన్ రెడ్డి ముందు కాదు అంటూ ఏపీ మంత్రి రోజా ఫైరయ్యారు. ఇవాళ అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యే బాలయ్య తొడగొట్టి… మీసం తిప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై బాలయ్య బాబుకు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉదయం 9 గంటల సమయంలో ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే తెలుగుదేశం సభ్యులు స్పీకర్ పోడియం దగ్గర తమ నిరసనను తెలిపారు. ఈ తరుణంలోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలయ్య బాబు మీసం తిప్పారు. అయితే బాలయ్య మీసం తిప్పడంపై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇవ్వడమే కాకుండా…. ఏపీ స్పీకర్ తమ్మినేని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అసెంబ్లీలో ఇలాంటి పనులు చేయకూడదని మొదటి వార్నింగ్ ఇచ్చారు.
అయితే అసెంబ్లీ వాయిదా పడ్డ తర్వాత రోజా మీడియాతో మాట్లాడుతూ… బాలకృష్ణ పై ఫైర్ అయ్యారు. బాలకృష్ణ సినిమా ఫంక్షన్కు వెళ్లి ఆడపిల్లలు కనిపిస్తే ము**ద్దు పెట్టండి… కడుపు చేయండి అంటాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ మీసాలు మెలేస్తే ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరని… సినిమా షూటింగుకు వచ్చినట్లు బాలయ్య బిహేవ్ చేస్తున్నాడని మండిపడ్డారు ఏపీ మంత్రి రోజా. అసెంబ్లీలో టిడిపి సభ్యులు చాలా దారుణంగా ప్రవర్తించారని… అసెంబ్లీలో షూటింగ్ జరుగుతున్నట్లు బాలయ్య మీసాలు తిప్పాడని మండిపడ్డారు రోజా. మీసాలు తిప్పడం ఏమైనా ఉంటే సినిమాలో చూపించుకోవాలని… రియల్ లైఫ్ లో కాదంటూ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి
- 64 ఏళ్ల వయసులో పెళ్లిచేసుకోబోతున్న జయసుధ.. మరోసారి ప్రియుడితో !!
- విజయ్ ఆంటోనీ కూతురి సూసై** లెటర్.. ఏమి రాసి ఉందంటే..?
- Trisha : పెళ్లైన నిర్మాతతో హీరోయిన్ త్రిష వివాహం..?
https://x.com/TeluguScribe/status/1704800652063588625?s=20