Home » రణబీర్ కపూర్ పై మంత్రి మల్లారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు.. ఇంతకు ఏమన్నారంటే ?

రణబీర్ కపూర్ పై మంత్రి మల్లారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు.. ఇంతకు ఏమన్నారంటే ?

by Anji
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు..  పాన్ ఇండియా వైడ్ గా యానిమల్ సినిమా ఫీవర్  చాలా ఎక్కువగా కనిపిస్తోంది.  యానిమల్ మూవీకి సంబంధించిన ట్రైలర్ ఎప్పుడు వచ్చిందో.. అప్పటి నుంచే ఈ సినిమా మీద హైప్ అనేది పెరుగుతూ పోతుంది. ఇక ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా డిసెంబర్ 01వ తేదీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  అంటే.. ఆ ట్రైలర్ ఇంపాక్ట్ జనాల్లో ఎంత ఎక్కువగా ఉందో ఇట్టే మనం అర్థం చేసుకోవచ్చు.  ఇలాంటి తరుణంలోనే ఈ మూవీఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మల్లారెడ్డి యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు.

Advertisement

ఇప్పటికే ఈ సినిమాకి రాజమౌళి, మహేష్ బాబు లాంటి డైరెక్టర్లు, హీరోలు చీఫ్ గెస్ట్ లుగా హాజరవ్వగా.. తెలంగాణ మినిస్టర్ అయిన మల్లారెడ్డి కూడా ఈవెంట్ కి హాజరై తనదైన రీతిలో అద్భుతమైన స్పీచ్ ని కూడా ఇచ్చాడు. ఇక అందులో భాగంగానే మహేష్ బాబును ఉద్దేశించి ఆయన చేసిన కొన్ని కామెంట్లు వైరల్ అవుతున్నాయి. బిజినెస్ మేన్ సినిమా వల్లనే తను పాలిటిక్స్ లోకి వచ్చాడని అలాగే సిస్టం కూడా ఇక్కడ అలాగే ఉందని మాట్లాడాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన పదుల సార్లు బిజినెస్ మెన్ సినిమా చేశారని చెప్పాడు. ఇక అదే విధంగా తెలుగు సినిమా అనేది ఇక ఐదు సంవత్సరాలలో బాలీవుడ్, హాలీవుడ్ రేంజ్ లో సినిమా విస్తరించుకోబోతుందంటూ చాలా రకాల కామెంట్స్ చేశాడు. అందులో భాగంగానే రాజమౌళిని ఉద్దేశించి మాట్లాడుతూ రాజమౌళి లాంటి డైరెక్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిజంగా మనం అదృష్టం అంటూ చెప్పాడు.

Advertisement

ఇక రణ బీర్ కపూర్ ని ఉద్దేశించి.. మీరు మంచి నటుడు అని.. మీరు కూడా హైదరాబాద్ కి వచ్చేయండి. తెలుగులో సినిమాలు చేయవచ్చు. ఇప్పటికే బెంగళూరులో ట్రాఫిక్ జామ్ అయింది. ముంబై పాతది అయిపోయింది. మీరు హైదరాబాద్ వచ్చేయండి ఇక్కడ సినిమాలు చేసుకోవచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.  ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.  ముంబైకి చెందిన సినీ అభిమానులు మల్లారెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా విమర్శిస్తున్నారు.  మల్లారెడ్డి అలా మాట్లాడటం  కరెక్ట్ కాదు అంటూ తమదైన స్టైల్ లో స్పందిస్తూ కౌంటర్లు వేస్తున్నారు.  ఇదిలా ఉంటే.. డిసెంబర్ 01న  యానిమల్ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతుండగా.. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ని ఇచ్చింది.  ఈ సినిమా నిడివి కూడా 3 గంటల 21 నిమిషాల 23 సెకండ్లు ఉండడం గమనార్హం.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading