Home » అప్పుల్లో మునిగిన మంత్రి కేటీఆర్… ఏకంగా రూ. 27 కోట్ల అప్పు!

అప్పుల్లో మునిగిన మంత్రి కేటీఆర్… ఏకంగా రూ. 27 కోట్ల అప్పు!

by Bunty
Ad

మంత్రిగా తన కార్యకలాపాల్లో బిజీబిజీగా గడిపే కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉంటారు. ఎవరైనా సమస్యపై ట్విట్టర్ లో విజ్ఞప్తి చేస్తే వెంటనే స్పందిస్తారు. అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశిస్తారు. అలా సామాన్య ప్రజలకు కేటీఆర్ పై నమ్మకం ఏర్పడింది. అందుకే తరచూ ఆయన ట్విట్టర్ లో ఎవరో ఒకరు ఏదో ఒక సమస్యపై విజ్ఞప్తి చేస్తూనే ఉంటారు. అలాంటి మంత్రి కేటీఆర్ ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు.

Advertisement

అది ఏంటి కష్టాలు అనుకుంటున్నారా, అసలు విషయంలోకి వెళితే, దేశంలో అత్యధిక అప్పులు ఉన్న మంత్రుల టాప్ టెన్ జాబితాలో తెలంగాణ మంత్రి కేటీఆర్ చేరారు. 27 కోట్ల 73 లక్షల 15 వేల 880 రూపాయల అప్పులతో, జాబితాలో ఆరో స్థానంలో నిలిచారు కేటీఆర్. అయితే, దేశంలోని 28 రాష్ట్రాలు రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రి మండలిపై ఏడిఆర్ అనే వెబ్సైట్ ఓ రిపోర్ట్ విడుదల చేసింది. ఎన్నికల సమయంలో ఈసీకి సమర్పించే ఆపీడవిట్ ల ఆధారంగా ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారి క్రిమినల్ కేసులు, ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను ఓ రిపోర్టు రూపంలో విడుదల చేసింది ఏడిఆర్ వెబ్సైట్.

Advertisement

ఈ రిపోర్టుతో కేటీఆర్ కు ఉన్న ఆస్తులు ఎన్ని?, అప్పులు ఎన్ని అనే వివరాలు కూడా ఉండటంతో, అసలు విషయాలన్నీ బయటపడ్డాయి. కాగా, కేటీఆర్ కు మొత్తం 41 కోట్ల 82 లక్షల 94 వేల 428 రూపాయల ఆస్తి ఉందని రిపోర్టులో పేర్కొన్నారు. అయితే, 283 కోట్లకు పైగా అప్పులతో మహారాష్ట్రకు చెందిన మంగల్ ప్రభాత్ లోదా అనే మంత్రి అగ్రస్థానంలో నిలిచారు. అయితే మొదటి నాలుగు స్థానాల్లో బిజెపికి చెందిన మంత్రులే ఉండటం గమనార్హం.

READ ALSO : మందు బాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..బాటిల్ కొనాలంటే ఇక నగదు అవసరం లేదు!

Visitors Are Also Reading