మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన సినిమా బోలా శంకర్. ఈ సినిమాను మెహర్ రమేష్ చాలా గ్రాండ్గా తెరకెక్కించారు. వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా… మొన్న శుక్రవారం రిలీజ్ అయి డిజాస్టర్ పేరు తెచ్చుకుంది. రిలీజ్ అయిన రోజు తప్ప… మరుసటి రోజు నుంచి బోలాశంకర్ కలెక్షన్లన్నీ పడిపోయాయి. అయితే బోలా శంకర్ సినిమా అట్టర్ ఫ్లాఫ్ అయితే టీమిండియా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
దీనికి కారణం మెహర్ రమేష్ సినిమాలు ప్లాప్ అయితే… టీమిండియా ప్రతిసారి ఐసీసీ టోర్నమెంట్ ను కొట్టడమే దీనికి కారణం.2011 సంవత్సరంలో మెహర్ రమేష్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా శక్తి సినిమా వచ్చి అట్టర్ ఫ్లాఫ్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత బిగ్గెస్ట్ డిజాస్టర్ గా శక్తి సినిమా నిలిచింది. అయితే అదే సంవత్సరం ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ ను ధోని సారథ్యంలో టీమిండియా ఎక్కించుకుంది.
అంతేకాదు 2013 సంవత్సరంలో మెహర్ రమేష్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా షాడో సినిమా వచ్చింది. ఆ సినిమా కూడా అందరికీ రాడ్ దింపేసింది. ఇక ఈ ఏడాది చిరంజీవి హీరోగా చేసిన బోలా శంకర్ సినిమా దారుణంగా ఫెయిల్ అయింది. ఇక ఈ ఏడాది అక్టోబర్లో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ జరగనుంది. మెహర్ రమేష్ ఫెయిల్యూర్ సెంటిమెంట్ ప్రకారం…. టీమిండియా ఈసారి వరల్డ్ కప్ కొట్టే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో ఫాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు జరిగిన సెంటిమెంట్ ను గుర్తు చేస్తూ.. ఫుల్ ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్.
ఇవి కూడా చదవండి :
రేణు దేశాయ్ కి అంబటి కౌంటర్.. నువ్వు నిజమైన భారతీయ మహిళవు !
ఫ్యాన్స్ కు షాక్…క్రికెట్ కు కోహ్లీ, రోహిత్ గుడ్ బై…?
టాలీవుడ్ స్టార్ హీరో కోసం తండ్రి చేతిలో దెబ్బలు తిన్న సాయి పల్లవి…!