Home » ఐకాన్ స్టార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్, సూపర్ స్టార్..

ఐకాన్ స్టార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్, సూపర్ స్టార్..

by Bunty
Published: Last Updated on

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న పుష్ప సినిమా డిసెంబ‌ర్ 17 వ తేదీన రిలీజ్ కాబోతున్న‌ది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. కాగా, ఈ సినిమా ట్రైల‌ర్ మ‌రికాసేప‌ట్లోనే రిలీజ్ కాబోతున్న‌ది. ట్రైలర్ కోసం అభిమానులు సాయ‌త్రం 6 గంట‌ల నుంచి ఎదురుచూస్తున్నారు. రెండు పార్టుల‌గా పుష్ప సినిమా రిలీజ్ కాబోతున్న సంగ‌తి తెలిసిందే. కాగా, ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వ‌హించేందుకు యూనిట్ ప్లాన్ చేస్తున్న‌ది. ఈనెల 12 వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.

కాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి, ప్రిన్స్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు హాజ‌రుకాబోతున్న‌ట్టు స‌మాచారం. కాగా, ఈరోజు ఉద‌యం వ‌ర‌కు సాహిద్ క‌పూర్‌, ప్ర‌భాస్‌లు కూడా వ‌స్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. జాతీయ మీడియాలో కూడా దీనిపై వార్త‌లు వ‌చ్చాయి. అఖండ సినిమాకు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా వెళ్ల‌డంతో బాల‌కృష్ణ కూడా ఈ ఈవెంట్ కు వ‌స్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది. కాగా, తాజా స‌మాచారం ప్ర‌కారం మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రిన్స్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబులు హాజ‌రుకాబోతున్నార‌ని ఫిల్మ్ న‌గ‌ర్ స‌మాచారం. ర‌ష్మిక మంధ‌న హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. డీఎస్‌పీ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రంలోని పాట‌లు ఇప్ప‌టికే మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకున్నాయి.

Visitors Are Also Reading