Home » ద‌ర్శ‌క‌త్ర‌యంతో క‌లిసి ప‌నిచేసే అరుదైన‌ అవ‌కాశం ద‌క్కిన హీరో మెగాస్టార్…!

ద‌ర్శ‌క‌త్ర‌యంతో క‌లిసి ప‌నిచేసే అరుదైన‌ అవ‌కాశం ద‌క్కిన హీరో మెగాస్టార్…!

by AJAY
Ad

బాపు, బాల‌చంద‌ర్,విశ్వ‌నాధ్ లాంటి ప్ర‌ముఖ సీనియ‌ర్ ద‌ర్శ‌కుల డైరెక్ష‌న్ లో న‌టించే అదృష్టం అతికొద్ది మంది న‌టుల‌కే ద‌క్కింది. అలా ఈ ద‌ర్శ‌క‌త్ర‌యంలో నటించే అదృష్టం వ‌రించిన హీరోలు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం….తార‌క‌రాముడు ఎన్టీ రామారావు క‌ళాత‌ప‌స్వి విశ్వ‌నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించారు. వీరి కాంబినేష‌న్ లో నిండు హృద‌యాలు అనే సినిమా వ‌చ్చింది. ఈ సినిమా అప్ప‌ట్లో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌రియు విశ్వ‌నాథ్ కాంబినేష‌న్ లో ఆత్మ‌గౌర‌వం, సూత్ర‌దారులు లాంటి చిత్రాలు వ‌చ్చాయి. అంతే కాకుండా కృష్ణ కూడా విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించారు. వీరిద్ద‌రి కాంబోలో నేరం శిక్ష అనే సూప‌ర్ హిట్ సినిమా వ‌చ్చింది. ఇక ఎన్టీరామారావు బాపు ద‌ర్శ‌క‌త్వంలో శ్రీరామాంజ‌నేయ యుద్దం అనే చిత్రంలో న‌టించారు. ఇక ఏఎన్ ఆర్ కూడా బాపు ద‌ర్శ‌క‌త్వంలో పలు చిత్రాల‌లో న‌టించి అల‌రించారు. బాపు ద‌ర్శ‌క‌త్వంలో కృష్ణ సాక్షి అనే చిత్రంలో న‌టించారు. అయితే ఈ హీరోలు మ‌రో ద‌ర్శ‌క‌దీరుడు బాల‌చంద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక్క సినిమా కూడా చేయ‌లేదు. కానీ బాపు, విశ్వ‌నాథ్ ల‌తో పాటూ బాల‌చంద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలోనూ న‌టించే అవ‌కాశం మెగాస్టార్ చిరంజీవికి మాత్ర‌మే ద‌క్కింది. బాపు దర్శ‌క‌త్వంలో చిరంజీవి మంత్రి గారి వియ్యంకుడు, మ‌న ఊరి పాండ‌వులు లాంటి చిత్రాల‌లో న‌టించి అల‌రించాడు.

Advertisement

manthrigari viyyankudu

manthrigari viyyankudu

అదే విధంగా బాల‌చంద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ ఆడ‌వాళ్లు మీకు జోహార్లు, రుద్ర‌వీణ‌, 47రోజులు, ఇది క‌థ కాదు లాంటి సూప‌ర్ హిట్ సినిమాల‌ను చేశారు.

Advertisement

rudraveena

rudraveena

మెగాస్టార్ బాపు కాంబినేష‌న్ లో వ‌చ్చిన మ‌న ఊరిపాండ‌వులు సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలించింది.

swayam krushi

swayam krushi

అంతే కాకుండా విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి హీరోగా తెర‌కెక్కిన ఆప‌ద్బాంద‌వుడు, స్వ‌యం కృషి సినిమాలు కూడా చిరంజీవికి ఎంతో గుర్తింపును తెచ్చిపెట్టాయి.

Visitors Are Also Reading