Home » మెగాస్టార్ చిరంజీవికి ఆపరేషన్.. సినిమాలకు గుడ్ బై?

మెగాస్టార్ చిరంజీవికి ఆపరేషన్.. సినిమాలకు గుడ్ బై?

by Bunty
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి స్టార్ హీరోగా ఎదిగాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక రాజకీయాల్లో నుంచి వైదొలిగిన తర్వాత ప్రస్తుతం వరుస సినిమాలతో టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బంపర్ విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి… తాజాగా బోలా శంకర్ సినిమాలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Advertisement

ఈ సినిమాను మెహర్ రమేష్ చాలా గ్రాండ్గా తెరకెక్కించినప్పటికీ… సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటించింది. అలాగే కీర్తి సురేష్…మెగాస్టార్ చిరంజీవి చెల్లెలుగా నటించింది.ఈ సినిమాలో డైరెక్షన్ వైఫల్యం కారణంగా సినిమా దారుణంగా విఫలమైంది. ముఖ్యంగా దర్శకుడు మెహర్ రమేష్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు ఫ్యాన్స్. ఇలాంటి తరుణంలో మెగాస్టార్ ఫ్యాన్స్ కు మరో షాక్ తగిలింది.

Advertisement

మెగాస్టార్ చిరంజీవికి మొకాలి ఆపరేషన్ ఈ వారం ఢిల్లీ లేదా బెంగళూరు నగరంలో జరిగే అవకాశం ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతుంది. దాదాపు నెలన్నర పాటు విశ్రాంతి తీసుకుంటారని కూడా తెలుస్తోంది. ఈ నెలాఖరు వరకు ఆయన హైదరాబాద్ మహానగరంలో అందుబాటులో ఉండరని సమాచారం అందుతుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి : 

రేణు దేశాయ్ కి అంబటి కౌంటర్.. నువ్వు నిజమైన భారతీయ మహిళవు !

ఫ్యాన్స్ కు షాక్…క్రికెట్ కు కోహ్లీ, రోహిత్ గుడ్ బై…?

టాలీవుడ్ స్టార్ హీరో కోసం తండ్రి చేతిలో దెబ్బలు తిన్న సాయి పల్లవి…!

Visitors Are Also Reading