Home » పెద్ద మ‌న‌సు చాటుకున్న చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్‌..ఆ సినిమా కోసం ఏం చేశారంటే..?

పెద్ద మ‌న‌సు చాటుకున్న చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్‌..ఆ సినిమా కోసం ఏం చేశారంటే..?

by Anji
Published: Last Updated on
Ad

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌లు క‌లిసి న‌టించిన ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఆచార్య . ఈ చిత్రం ప‌లుమార్లు వాయిదా ప‌డి ఎట్ట‌కేల‌కు ఏప్రిల్ 29న విడుద‌ల అయింది.చిరు, చిర‌ణ్ క‌లిసి న‌టించిన ఈ సినిమా మొద‌టి రోజు నుంచే డిస్ట్రిబ్యూట‌ర్స్‌కు భారీ న‌ష్టాల‌ను మిగిల్చింది. అస‌లు అపజ‌యం ఎరుగ‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఒక‌వైపు, మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ తండ్రి కొడుకులు మ‌రో వైపు ఉండ‌డంతో సినిమా అంచ‌నాలు రెట్టింపు చేసింది. కానీ ఫ‌లితం అందుకు భిన్నంగా ఉంది.

Advertisement

ఈ సినిమా విడుద‌ల‌కు ఒక రోజు ముందే నెగిటివ్ టాక్ రావ‌డంతో ఈ చిత్రం ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింద‌నే చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా ఈ చిత్రంలో గ్రాఫిక్స్ చెత్త‌గాఉన్నాయ‌ని.. ఇద్ద‌రూ స్టార్స్ ఉన్నా సినిమా ప్రేక్ష‌కుల‌కు ఎక్క‌డ కూడా క‌నెక్ట్ కాలేద‌నే టాక్ వినిపించింది. ఇక అప్ప‌టి వ‌ర‌కు అప‌జ‌యం ఎరుగ‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌కి ఆచార్య సినిమాతో పెద్ద ఎదురుదెబ్బ త‌గిలింద‌నే చెప్ప‌వ‌చ్చు. అస‌లు సినిమాను కొర‌టాల శివనే ద‌ర్శ‌క‌త్వం వ‌హించారా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సినిమాను చిరంజీవి అండ్ టీమ్ హ్యాండిల్ చేశార‌నే టాక్ విన‌ప‌డింది.

Advertisement


ఆచార్య సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోవడంతో దర్శకుడు కొరటాల శివ ఇంటి ముందు ధర్నాకు దిగారు. దీంతో కొరటాల శివ 15 కోట్ల వరకు నష్టపరిహారంతో పాటు ఎన్టీఆర్ తో చేసిన సినిమా హక్కులను ఇస్తానని చెప్పడంతో వారు శాంతించినట్టు సమాచారం. ఆచార్య సినిమా కోసం చిరంజీవి, రామ్ చరణ్ తీసుకున్న అడ్వాన్స్ 20 కోట్ల రూపాయలను డిస్ట్రిబ్యూటర్స్ కు వెనక్కి ఇచ్చారు. ఇక ఈ సినిమాను రాంచరణ్ చిరంజీవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ చెప్పిన విష‌యం తెలిసిందే. విడుద‌ల‌కు ముందే ఈ సినిమాను నిర్మాత ద‌గ్గ‌ర నుంచి కొర‌టాల శివ తీసుకున్నార‌ట‌.

Also Read : 

అత్తారింటికి దారేది, అంటే సుంద‌రానికి ఈ రెండు సినిమాల్లో ఉన్న కామ‌న్ పాయింట్ ను గమ‌నించారా..?

 

Visitors Are Also Reading