Home » మెగా డాటర్స్ ను శాపం వెంటాడుతోందా….ఈ కష్టాలకు కారణం ఏంటి….?

మెగా డాటర్స్ ను శాపం వెంటాడుతోందా….ఈ కష్టాలకు కారణం ఏంటి….?

by AJAY
Ad

మెగాస్టార్ నట వారసులుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాహీరోలు ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలుతున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి యంగ్ హీరోలు ప్రస్తుతం స్టార్ హీరోలుగా రానిస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్ లు కూడా హీరోలుగా రాణిస్తున్నారు. వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో బిజీగా మారారు. అయితే మెగాడాట‌ర్స్ ప‌రిస్థితి మాత్రం అంత చ‌క్క‌గా లేద‌నే చెప్పాలి. ఏదో ఒక విష‌యంలో ఇబ్బందులు ప‌డుతూనే ఉంటున్నారు.

Advertisement

అంతే కాకుండా వార్త‌ల్లో నిలుస్తున్నారు. మెగాస్టార్ పెద్ద కుమార్తె సుస్మిత మొద‌ట ఉద‌య్ కిర‌ణ్ ను ఇష్ట‌ప‌డింద‌ని చెబుతుంటారు. ఆ త‌ర‌వాత మెగాస్టార్ ఇద్ద‌రికీ వివాహం చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. కానీ ఎంగేజ్మెంట్ జ‌రిగిన త‌ర‌వాత వీరి పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. అయితే ప్ర‌స్తుతం మాత్రం సుస్మిత మ‌రో వ్య‌క్తిని పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ ను గ‌డిపేస్తుంది. అంతే కాకుండా రీసెంట్ గా నిర్మాణ‌రంగంలోకి అడుగులు పెట్టింది. ఇదిలా ఉంటే చిరు రెండో కుమార్తె శ్రీజ మొద‌ట ఓ వ్య‌క్తిని ప్రేమ‌వివాహం చేసుకుంది.

Advertisement

కుటుంబం పెళ్లికి నిరాక‌రించ‌డంతో ఇంటినుండి వెళ్లిపోయి ప్రేమించిన వ్య‌క్తిని పెళ్లి చేసుకోవ‌డం వ‌ల్ల వార్త‌ల్లోకి ఎక్కింది. ఇక వీరికి ఓ కూతురు పుట్ట‌గా త‌ర‌వాత భ‌ర్త‌తో వివాదాలు త‌లెత్త‌డం వ‌ల్ల విడాకులు తీసుకుంది. ఇక ఆ తర‌వాత క‌ల్యాణ్ దేవ్ ను వివాహం చేసుకుంది. అత‌డు హీరోగా ప‌రిచ‌య‌మై సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇక కొంత‌కాలంగా వీరు విడివిడిగా ఉంటున్న‌ట్టు టాలీవుడ్ లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

niharika konidela

niharika konidela

త్వ‌ర‌లోనే విడాకులు తీసుకోబోతున్నార‌ని వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే నాగ‌బాబు కూతురు నిహారిక రీసెంట్ గా వార్త‌ల్లోకి ఎక్కింది. అర్థ‌రాత్రి దాటిన త‌ర‌వాత నిహారిక ప‌బ్ లో ప‌ట్టుబ‌డ‌టం..అదే ప‌బ్ లో డ్ర‌గ్స్ ఆన‌వాళ్లు ఉండ‌టంతో నిహారిక వార్త‌ల్లో హాట్ టాపిక్ గా మారింది. దాంతో మెగాడాట‌ర్స్ ను శాపం వెంటాడుతోందా…? వారికే ఎందుకు ఇలా జ‌రుగుతుంద‌ని నెటిజన్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇవి చ‌ద‌వండి :

చిన్నారికి పెద్ద‌సాయం….గొప్ప‌మ‌నసు చాటుకున్న రామ్ చ‌ర‌ణ్…!

మీకు అక్కడ పుట్టు మచ్చలు ఉన్నాయా.. అయితే అదృష్టవంతులే..!!

Visitors Are Also Reading