Home » మెగా హీరోలతో కానిది, నందమూరి హీరోలు చేస్తున్నారా..సెంటిమెంట్ ఏంటంటే..?

మెగా హీరోలతో కానిది, నందమూరి హీరోలు చేస్తున్నారా..సెంటిమెంట్ ఏంటంటే..?

by Sravanthi

ప్రస్తుతం మన తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు ఉంటాయి. ఈ ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలు ఉన్నారు. నందమూరి ఫ్యామిలీ నుండి జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ హీరోలుగా ఉన్నారు. ఇందులో బాలకృష్ణ,ఎన్టీఆర్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నారు. మరోవైపు మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది స్టార్ హీరోలు కూడా రాణిస్తున్నారు.

also read:భార్య భర్తని ఆ ఒక్క విషయంలో మాత్రం దూరం పెట్టకూడదు..పెను ప్రమాదమే..!!

మెగాస్టార్ చిరంజీవి, బన్నీ, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ రాణిస్తున్నారు. కట్ చేస్తే ప్రస్తుతం ఒక కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది. గతంలో రామ్ చరణ్ తో “వినయ విధేయ రామ” మూవీ చేసిన బోయపాటి శీను ఫ్లాప్ అయ్యారు. ఆ సమయంలో మెగా ఫ్యాన్స్ బోయపాటిని దారుణంగా ట్రోలింగ్ చేశారు. ఆ టైం లోనే బాలకృష్ణ అతన్ని ఆదుకున్నాడు. వీరి కాంబోలో వచ్చిన “అఖండ” మూవీ విజయం అందుకుంది. అలాగే మెగాస్టార్ తో కొరటాల శివ తీసిన ఆచార్య మూవీ ఫ్లాప్ అయ్యింది.

ఆ తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నారు. ఒకవేళ ఈ సినిమా హిట్ కొడితే మాత్రం నందమూరి హీరోల ముందు మెగా హీరోల పరువు పోవడం ఖాయమని ఫ్యాన్స్, ట్రేడ్ పండితులు అంటున్నారు.మూవీ ఫ్లాప్ అయితే డైరెక్టర్లను మెగా హీరోలు వారి ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్నారని, నందమూరి హీరోలు మాత్రం ఆదు కుంటున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం పై సోషల్ మీడియా వేదికగా వివిధ రకాలుగా రచ్చ కొనసాగుతోంది.

also read:

Visitors Are Also Reading