Telugu News » Blog » Twins: నయన్-విగ్నేష్ తప్పు చేస్తే శిక్ష ఏమిటో తెలుసా..?

Twins: నయన్-విగ్నేష్ తప్పు చేస్తే శిక్ష ఏమిటో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

హీరోయిన్ నయనతార తమిళ దర్శకుడు విజ్ఞేశ్ శివన్ ఈ ఏడాది జూన్ 9వ తేదీన అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఈ వివాహ వేడుకకు దేశ నలుమూలల నుంచి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు.. చూడ ముచ్చటైన జంట అంటూ ఆశీర్వదించారు.. ఇంతలోనే నయన్-విగ్నేష్ దంపతులు ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు.. దీంతో ఈ వార్త విన్న వారంతా షాక్ అవుతున్నారు.. పెళ్లయి 5 నెలలు కూడా కాలేదు.. ఇంతలోనే నయనతార తల్లి అవ్వడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. నయన్ విగ్నేష్ దంపతులు ఇద్దరు కవల పిల్లలను కిస్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలను షేర్ చేశారు.

Advertisement

also read:కోవై సరళ ఆ సినిమాలో హీరోయిన్ గా చేసిందని మీకు తెలుసా..?

ఇది కాస్త వైరల్ అవడంతో చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు.వీరి అభిమానులు సంబరపడుతున్నారు, కానీ కొంతమంది ఇంత తొందరగా ఎలా, అంటూ ఆరా తీస్తున్నారు.. విమర్శలు కూడా చేస్తూ ఈ దంపతులను నిలదీస్తున్నారు. నయన్ విజ్ఞేశ్ దంపతులు సరోగసీ ద్వారా కవల పిల్లలు జన్మించారు.. ఈ కవల అబ్బాయిలను కిస్ చేస్తూ ఫోటోలు షేర్ చేయడంతో పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలి అంటే వివాహం జరిగి కనీసం ఐదు సంవత్సరాలు దాటి ఉండాలి.. అప్పటికి కూడా పిల్లలు పుట్టకుండా ఉంటే సరోగసి ఆశ్రయించవచ్చు..

Advertisement

ఈ నిబంధనలు ఏవీ పాటించకుండా వారికి ఎలాంటి సమస్య లేకున్నా, పెళ్లి అయి కనీసం ఐదు నెలలు కూడా పూర్తి కాకముందే సరోగసీ ద్వారా పిల్లల్ని కన్నారని, చట్టవిరుద్ధమని, నిబంధనలు తుంగలో తొక్కారని పలువురు రాద్ధాంతం చేస్తున్నారు.. నిబంధనలు ఉల్లంఘిస్తే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, పది లక్షల వరకు పైన్ విధిస్తారని సోషల్ మీడియా వేదికగా పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై నయన్ విగ్నేష్ దంపతులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది స్పష్టం కావాల్సి ఉంది..

Advertisement

also read:

You may also like