ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా థియేటర్‌లలో టికెట్ల ధరలపై ప్రభుత్వానికి టాలీవుడ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. టికెట్ ధరల విషయంలో సినిమా పెద్దలు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. టికెట్ ధరలు పెంచాలని నిర్మాతలు అడుగుతుంటే.. ప్రజలకు అందుబాటులో ఉండడం కోసమే ధరలను తగ్గించాం అని ప్రభుత్వం పేర్కొంటుంది.
Advertisement
సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేందుకే టికెట్ల రేట్లను తగ్గించడంతో పాటు ప్రభుత్వం ఈ జీవోను తీసుకొచ్చిందని మంత్రులు పేర్కొంటున్నారు. పేదలకు వినోదం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ మంత్రులు మైకులు పెట్టి మరీ మొత్తుకుంటున్నారు. మరొకవైపు సినిమా టికెట్ల ధరలను నిర్ణయించే అధికారం అసలు ప్రభుత్వానికే లేదని పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
ఈ విషయంపై తాజాగా సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. ఇప్పటికే ఏపీ మంత్రి పేర్నినానితో మాటల యుద్ధానికి దిగారు ఆర్జీవీ. అయితే ఇప్పుడు తనకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయంటూ ఓ వీడియోను విడుదల చేసారు. ఈ వీడియోలో తనకు ఉన్న పది ప్రశ్నలను ప్రభుత్వంపై సంధించారు వర్మ.
అయితే రామ్‌గోపాల్ వర్మ అడిగిన 10 ప్రశ్నలపై మెగాబ్రదర్ నాగబాబు రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబు స్పందించారు. మీరు అడిగిన ప్రశ్నలన్నీ కరెక్ట్. నేను కూడా ఆ ప్రశ్నలను అడగాలని అనుకున్నాను. పది ప్రశ్నలు మీనోటి ద్వారా బయటికొచ్చాయి అని ట్వీట్ చేసారు నాగబాబు. ఇప్పుడు నాగబాబు ట్వీట్‌పై ఏపీ మంత్రులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి మరీ.