ప్రముఖ నటి, సీనియర్ హీరోయిన్ మీన భర్త విద్యాసాగర్ మృతి చెందిన విషయం విధితమే. అయితే మీన భర్త మరణం పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కొంత కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూన్ 28న తుదిశ్వాస విడిచారు. మీన భర్తను బతికించుకునేందకు ఎంతో ప్రయత్నించారట. కానీ ఆయన కానరాని లోకాలకు వెళ్లిపోయారు.
Advertisement
తన భర్త మరణం తరువాత మీన సోషల్ మీడియాలో ఎమోషనల్ మెసేజ్ పోస్ట్ చేశారు. మా భర్తను కోల్పోవడం చాలా బాధకరని తెలిపారు. మీడియా మా ప్రైవసీని గౌరవించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. పిచ్చి రూమర్స్ క్రియేట్ చేయవద్దని వేడుకుంటున్నాను. నా భర్త మరణం పట్ల అసత్యాన్ని ప్రచారం చేయడం ఆపివేయండి.
ఈ కష్ట సమయంలో నా ఫ్యామిలీ వైపు నిలబడి నా కూతురుకు అండగా ఉంటానని చెప్పారు. అదేవిధంగా వైద్యం అందించడానికి సహాయపడ్డ ముఖ్యమంత్రి, హెల్త్ మినిస్టర్కు ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పారు. 2010లో పెళ్లి తరువాత 2011 ఏడాదిలో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. కూతురు ఆలనా పాలన చూసుకుంటూ కొద్ది రోజులు సినీ ఇండస్ట్రీకి దూరం అయింది.
Advertisement
ఆ తరువాత భర్త ప్రోత్సాహంతో ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది మీన. ఆమె సినిమా నటిస్తున్న సమయంలోనే తన కూతురు నైనికను కూడా బాలనటిగా వెండితెరకు పరిచయం చేశారు. మీన జీవితం అద్భుతంగా సాగుతుందనుకున్న సమయంలోనే భర్త విద్యాసాగర్ అకాల మరణం ఆమెను ఎంతగానో కృంగదీసింది. తన కూతురు నైనిక బాగోగులు చూసుకోవడానికి తండ్రి లేడనే లోటు తెలియకుండా మీన పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటివరకు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసిన ఇక సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. భర్త మరణం తరువాత మీనకు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటికి వచ్చాయి. చూసిన వారు స్టే స్ట్రాంగ్ మీన గారు అని కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read :
పవిత్ర లోకేష్ నరేష్ ను 6 నెలల్లో వదిలేస్తుంది…భర్త సుచేంద్ర సంచలన ఆరోపణలు..!
అమ్మోర్ రష్ చూసి తీసుకెళ్లి చెత్త కుప్పలో పడేసిన నిర్మాత.. ఇక ఆ తరువాత ఏం జరిగిందంటే..?