Home » కీలక నిర్ణయం తీసుకున్న మీనా.. హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు..!!

కీలక నిర్ణయం తీసుకున్న మీనా.. హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు..!!

by Sravanthi
Ad

తెలుగు ఇండస్ట్రీలో అలనాటి నటి మీనా అంటే తెలియనివారుండరు.. చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చి అనేక సినిమాల్లో నటించి, చివరికి హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది.. ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది అని చెప్పవచ్చు. ఆ నాటి జనరేషన్ కాకుండా ఇప్పటి జనరేషన్ లో ఉన్న హీరోల్లో చాలా మందితో జతకట్టింది ఈ అమ్మడు. కానీ ఇటీవలే ఆమె జీవితంలో విషాదం చోటు చేసుకుంది.

Advertisement

తనకు ఎంతో ఇష్టమైన తన భర్తను చిన్న వయసులోనే కోల్పోయింది.. దీంతో మీనా తన బిడ్డను చూసుకుంటూ ఒంటరయిపోయింది.. ఈ క్రమంలోనే ఆమె ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది.. తన అవయవాలను దానం చేస్తానని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఎంతో కాలం పాటు అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైనటువంటి వారికి అవయవ దానం చేయడంవల్ల రెండవ జీవితం లభిస్తుంది అని తెలియజేసింది.. ఒక మనిషి ఎనిమిది మంది ప్రాణాలను కాపాడ గలడు అని తెలియజేసింది..

Advertisement

కాబట్టి అవయవదానం అనే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ పరిగణలోకి తీసుకోవాలని, అవయవాలు కోల్పోయి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని, నాలాగా ఎంతోమంది భర్తలను కోల్పోతున్నారని, ఆ బాధ చెప్పరానిది అని తెలిపింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మీనా హస్బెండ్ విద్యాసాగర్ కు సరైన సమయంలో ఊపిరితిత్తులు దొరకకపోవడంతోనే మరణించారని తెలియజేసింది.. అందుకే మీనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.. దీంతో మీనాకు నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.

ALSO READ;

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌నున్నాడా..? కార‌ణం ఏమిటంటే..?

బాల‌కృష్ణ న‌టించిన అఖండ సినిమాలో హీరోయిన్ పాత్రను ఈ న‌లుగురు హీరోయిన్స్ రిజెక్ట్ చేసిన విష‌యం మీకు తెలుసా..?

 

Visitors Are Also Reading